మనస్సాక్షి
మన్ మే ఆగ్ లగాతే
అంగారే
ఏక్ థండా పైగామ్ లే
ఆయే
మేరా ఖాతిల్
మేరా మసీహా అబ్ భీ
ముజ్ పర్ మర్తా హై
ఖుదాకా షుకర్ హై
వో ఆజ్ భీ మేరీ అమానత్
హై
అల్లాహ్ కాదన్నా ఇదే
నిజం
శ్రీ రాముడు వలదన్నా
ఇదే సత్యం
జీసస్ వారించినా ఇదే
నిత్యం
నా మనసు తెలుసుకుంది
ఆ మనసు గుట్టు వీడింది
గుండెపై నిప్పులు
కురిపించినా
వాడి పదాల నిప్పు
కణికలే వర్షించినా
నీవు నాకు లేవు
నీకు నేను కాను
అంటూ బింకాలకు పోయినా
ఆ ఎదలోతుల్లో
మంచు శిలలు
కరగనే లేదని
తేలిపోయింది
నా మనసు దారి మరలిన
ఊహనే
ఆ మనసు తట్టుకోలేదని
తెలిసిపోయింది
మూగబోయిన నా మనస్సు
మనస్సు స్పందనలోనే
నిజాన్ని చూడగలిగింది
ఇప్పుడు ఆ మనస్సు
ఎన్ని చెప్పినా
నా మనసునే శపించినా
అది అబద్దమేననీ
ఆ మనసులో మలయసమీరాలు
ఆగిపోలేదనీ
మమతల మతాబులు
విరబూస్తూనే ఉన్నాయని
కనబడుతూనే ఉంది
దారి మరలని
నా మనసు ఇదే
నమ్ముతోంది
మనస్సు సాక్షిగా
మనస్వినీ
No comments:
Post a Comment