మనసు పాగా
నా కంటి పాపలకు ఏమయ్యింది
నా లో ఉన్న ఆలోచనలు
నా కన్నులకు
అందటం లేదా
నా మెదడుపై
కనుపాపలు తిరుగుబాటు
చేస్తున్నాయా
ఏం జరుగుతోంది
ఎప్పుడూ ఒకటే దృశ్యం
నాకెందుకు కనపడుతోంది
నలుగురిలో నేనున్నా
అందరిలో నేనున్నా
ఒంటరి తనంతో
మనసుగోడు చెప్పుకుందామనుకున్నా
కంటి తెరలపై
లీలగా కనిపించి
మురిపించే
ఆ వదనమే
ఎటుచూసినా తనే
ఏదో చెబుతోంది
ఇంకేదో అడుగుతోంది
నవ్వుతోంది
నవ్విస్తోంది
చీకటి పడిన వేళ
అర్ధరాత్రి దాటినా
మూసుకోని రెప్పలు
అలసిపోయి
క్షణంపాటు వాలిపోతే
మళ్ళీ తనే
మెల్లగా మగతలోకి జారుకున్న
నన్ను
తట్టిలేపి అల్లరి చేస్తుంది.
చెవులలో ఏదో చెబుతూ
నిశ్శబ్దంలాంటి సవ్వడితోనే
కునుకుకు దూరం చేస్తోంది
ఏమయ్యింది నా కన్నులకు
ఇలా ఎందుకు చేస్తున్నాయి
నాతో లేనిది
నా తోనే ఉన్నట్టు
ఎందుకు చూపిస్తున్నాయి
కలకాని కలలా
నిజమైన భ్రాంతిలా
చెదరిపోయిన జ్ఞాపకంలా
ఎందుకు
తనే కనిపిస్తోంది
ఇది కన్నుల తిరుగుబాటేనా
లేక
విలపిస్తున్న మనసు
కన్నుల మైదానంలో
పాగా వేసిందా
మనస్వినీ
మనస్వినీ
No comments:
Post a Comment