దేవుడా ఇదేమి బంధం ?
ఈ కంట కన్నీరు ఒలికితే
ఆ కన్నులు చెమరుస్తున్నాయి
ఈ మనసు ఆవేదన చెందితే
ఆ మనసు రోదిస్తోంది
ఈ హృదయం మూగబోతే
ఆ హృదయం మాటలు మానేస్తోంది
ఈ కన్నులు నవ్వితే
ఆ కన్నుల్లో వెన్నెల
కురుస్తోంది
ఈ మనసు స్వాంతన పొందితే
ఆ మనసు పులకిస్తోంది
ఈ హృదయం రాగమందుకుంటే
ఆ హృదయం శృతి కలుపుతోంది
ఈ పెదాలు విచ్చుకుంటే
ఆ పెదాలు మెరుపులు
దిద్దుకుంటున్నాయి
ఈ దేహం జీవంగా ఉంటేనే
ఆ దేహం ఊపిరిపోసుకుంటోంది
ఆ మనసు మాటలు
ఆ మనసు చేతలు
ఆ మనసు లక్ష్యం
ఆ మనసు గమ్యం
ఆ మనసు పయనం
ఈ మనసు చుట్టే
ఇది ఏ బంధం
ఇది ఏ అనుబంధం
ప్రేమా
అనురాగమా
అభిమానమా
ఆరాధనా
ఈ బంధాన్ని ఏమని పిలవాలి
ఏమని కొలవాలి
ప్రేమాభిమానాల హద్దులు దాటింది
అనుబంధాల అవధులు వీడింది
ఇది పవిత్ర ఆత్మల అనుబంధమా
మనసూ మనసుల ఆరాటమా
అవధులే లేని
అంతరాలు కానరాని
ఇద్దరూ ఒకరే అయిన
చరిత్రలో లేని
మాటలకందని
మరో బంధమా
ఆత్మల కలయిక ఇదేనా
దేవుడా ఏమంటారు ఈ బంధాన్ని ?
No comments:
Post a Comment