Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 8 August 2015

నా లాస్ట్ జర్నీ నీవే

నా లాస్ట్ జర్నీ నీవే

నీవు నాకు దూరమయ్యావా
నేను నీకు దూరమయ్యానా
నీకూ నాకూ మధ్య
ఉన్న దూరమెంత
ఉన్న దూరంలో నిజమెంత
నేను నీకు దూరమయ్యాను
అనుకున్న ప్రతిసారీ
నీకు ఇంకా చెరువే అయ్యాను
చుట్టుముట్టే నీ ఆలోచనలు
ఉక్కిరిబిక్కిరి చేసే నీ జ్ఞాపకాలు
నిన్నూ నాకు దగ్గరే చేస్తున్నాయి
భౌతిక దూరాలు ఎన్ని సార్లు వచ్చినా
ఎన్ని అగాధాలు పుట్టుకు వచ్చినా
ఆవేశాలు రగిలి అగ్ని వర్షం కురిసినా
మనసు దూరం తగ్గుతూనే ఉంది
నిజానికి ఇది దూరమా
అందరికీ కనిపించే ఎడబాటేనా
కనులముందు కనిపించే వారు
దగ్గరగా ఉన్నారనుకోవాలా
మనసులో లేని వారెక్కడున్నా ఏం లాభం
విభేదాల కొలిమిలో రగిలినా
అనుమానాల కుంపటిలో మాడిపోయినా
ఇరు తనువులు దూరమైనా
రెండు మనసుల ఆలోచనల గమ్యం
ఒకటే అయితే
దూరాలు మరింతగా దరి చేర్చవా
దూరమన్నది ఒక అబద్దం
చేరువైనదే పచ్చి నిజం
నీ ఆలోచనా తరంగాలు
ఎప్పుడూ నాకు నీడలాగే ఉంటాయి
నా ఊపిరిలో శ్వాసలా
నా కంటి పాప వెలుగులా
నా అడుగులకు జాడలా
నిత్యం నా వెంటే ఉంటావు
నేను నీకు దూరమెలా అయ్యాను
నా లాస్ట్ జర్నీ నీవే
మనస్వినీ

2 comments: