నాలో మనసే లేదేమో
అవునేమో
నిజమేనేమో
ఆ మనసు నిందలు
వాస్తవమేనేమో
మనసు స్పందనలు
అబద్దమేనేమో
మనసురాతలు నిజం కావేమో
అక్షరాల రాతలు
కల్పితాలేనేమో
భావాల పుష్పాలు
ప్లాస్టిక్ పువ్వులేనేమో
అసలు మనసులో స్పందనలు
లేనేలేవేమో
రాసుకున్న రాతలు ఆత్మ
వంచనేనేమో
అంతరంగాలూ
అంకితాలూ
దిఖావాయేనేమో
కన్నీటి సుడులూ
గుండె గుడిలో ఎగసిపడే
కెరటాలు
క్షణం క్షణం యాతనలూ
మెలియపెట్టే వేదనలూ
అంతా భ్రాంతియేనేమో
పుడమి చుట్టూ
చంద్రునిలా
మనసు చుట్టూ మనసు
తిరగలేదేమో
అల్లకల్లోలాలకూ
ఉప్పొంగే వేదనలకూ
గొంతును చించే కేకలకూ
ఆలవాలమైన నా మనసు
నిజంగా మనసే కాదేమో
మనసు ఒక గాజు ఫలకం అనే
భావకుల సూత్రం
ఫక్తు భావమేనేమో
గాజు మనసే అయితే
నా మనసు ఇంకా ఎందుకు
పగలలేదు
నిజానికి నాలో మనసే
లేదేమో
No comments:
Post a Comment