పరాజయ
సాక్షి
ఒక్కసారి గతంలోకి
తొంగి చూసాను
నేటి నుంచి నాటిలోకి
పరకాయప్రవేశం చేసాను
ఒక వైభవం కదలాడింది
ఆనందం తొణికిసలాడింది
ఒక చల్లని తొలకరి
పలకరించింది
ఎక్కడో కోయిల
కూస్తోంది
పక్షుల కువకువలు
వీనుల విందు
చేస్తున్నాయి
ప్రతి పువ్వూ
నవ్వుతోంది
ప్రతి గుండె
పులకరిస్తోంది
ఏదో తెలియని రాజసం
లీలగా కదులుతోంది
ప్రతి పలకరింపులో
గౌరవం
ఏదో తెలియని అభిమానం
మనసుకు నచ్చిన మనసే లేకున్నా
అన్వేషణ నిరంతర వేదనే
అయినా
అప్పుడు నా మనసు
అలమటించలేదు
గుండె పగలలేదు
మనసులో వేదనను
కవితలుగా రాసుకున్నా
ఊహలుగా చెప్పుకున్నా
వసంతం మాత్రం వాడిపోలేదు
నా సామ్రాజ్యంలో
రారాజుగానే
నీరాజనాలందుకున్నా
ఒక్కసారి గతం పరదాలు
తీసేసి
ఇప్పుడు అనే లోకంలోకి
అడుగుపెడితే
ఏముంది
శిధిల వైభవం కళ్ళ
ముందు నిలిచింది
పరాజయానికి సాక్షిగా
No comments:
Post a Comment