Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 20 April 2015

అనుబంధమా అనుభవమా

అనుబంధమా అనుభవమా

పొగలు సెగలు కక్కుతున్న తనువులు
పరస్పర స్వార్ధం తో లతల్లా  పెనవేసుకుంటే...
జ్వలిస్తున్న దేహాలు ఉపశమనం కోసం
ఒక దానిని ఒకటి ఆక్రమించుకుంటే ...
రగిలిన మదన సీమలో స్వేద బిందువులు కురిస్తే
చల్లారిన ఆ దేహాలు
ఇక కలిసి ఉండలేమంటూ దూరంగా జరిగిపోతే
అది అనుబంధమా లేక అనుభవమా...
దినమంతా తగువులై
అనుమానమే జీవనమై
అవమానమే పలకరింపులై
నిశి దుప్పటిలో మరలా ఒకటై
అనుబంధమంటే ఇంతేనా...
మనసులో కదులుతున్న గాయం మంటలు రేపుతూ ఉంటే
అనుబంధమనే బంధం తూట్లు పొడుస్తూ ఉంటే
ఆ అనుభవం కోసం మళ్ళీ ఆరాటమే...
నువ్వు నిజమైన హీరోవి
నువ్వే అసలైన మగాడివి అని ఒకరు...
అతిలోక సుందరి నువ్వే
అడతనమంటే నీదే అని ఇంకొకరు...
నిశి పరదా జారిపోగానే
మొగ్గ తొడిగే ఆవేశం పువ్వులు...
క్షణమొక నరకంగా
దినమొక గండంగా
గుండెను పుండు చేసుకుంటూ
చీకటి పొడవగానే ఆ దేహంతోనే
మరలా లేపనం రాసుకుంటూ
ఉందో లేదో తెలియని అనుబంధం నుంచి
అనుభవంలోకి జారుకుంటూ...
ఏమో ఏది గొప్పదో
మనసును చిద్రం చేసే అనుబంధం
అనుభవం ముందు ఓడిపోయిందా...
అనుభవమే గొప్పదైతే
అనుబంధం ఎందుకు
గుండెకు గాయాలెందుకు...

No comments:

Post a Comment