ఎక్కడా నీ చిరునామా...
అన్నదమ్ముల
అనుబంధంలో చూసాను
ప్రతి గుండెను
తట్టి చూసాను
ఏ గుండెలోనూ
కానరాలేదు...
ఎవరి లెక్కలు
వారివి
ఎవరిప్రయోజనం
వారిది...
కిందపడిన
వాడికి చేయూతనిస్తే
మనకు మిగిలేది
ఏమనే ప్రశ్నలు...
భార్యా భర్తల
అనురాగంలో పరికించి చూసాను
నిశి రాతిరి
అనుబంధాన్ని కదిలించాను...
చిరునవ్వుల
మెరుపుల్లో వెతికాను
నువ్వులేక నేను
లేను అన్న బాసలలో శోధించాను
అక్కడా
కానరాలేదు ...
మాటల్లో డొల్లతనమే
పలుకుల్లో
మాయాజాలమే
రాజీ పడుతున్న
జీవన సమరాలే...
బంధువులనే
మనుషుల గూడారాల్లో తొంగి చూసాను
నలువైపులా
కాచుకుని ఉన్న రాబందులే ...
రాబందుల
మాటల్లోనూ అన్వేషించాను
ఎక్కడా
కనిపించలేదు...
అసలు నువ్వు
ఎక్కడున్నావు
నీరూపమేమిటి
ఎలా ఉంటావు
నీవు ...
అనుబంధాల ముసుగులో
దాగున్నావా
ఆవేశం అంచులలో
జారిపోయావా ...
అనుమానాల
చీకటిలో దాగి ఉన్నావా
మాయాలోకపు
పలుకుల్లో కరిగిపోయావా ...
అసలు ఎక్కడున్నావు
ఒక్కసారి
చెప్పవా
ఓ ప్రేమా
ఎక్కడ
నీ
చిరునామా...
No comments:
Post a Comment