దేవుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్
పరిమళించే స్నేహం
కావాలి
మనసైన మనసు కావాలి...
గుభాళించే హృదయం
కావాలి
నన్ను నన్నుగా చూసే మనిషి
కావాలి...
నా మనసు బాధ వినే మనసు
కావాలి
నన్ను నా కోణంలో చూసే
కన్నులు కావాలి...
నా పలుకుల్లో అర్ధం
గమనించాలి
నా కన్నుల్లో ప్రేమను
గుర్తించాలి...
నా కన్నీటి సుడుల్లో
కరిగిపోవాలి
నా చిరునవ్వుల్లో
పువ్వులా పూయాలి...
లోకం నన్ను నమ్మలేదు
సమాజం నన్ను
ముద్దాడలేదు...
ఎవరి కోణం వారిదే
ఎవరి ఆలోచన వారిదే...
ఎవరి ఎత్తులు వాళ్ళవి
ఎవరి దారులు వారివి...
స్నేహం కోసం
ఆరాటపడ్డాను
మనసుకోసం
సాగిలపడ్డాను...
ఎవరూ అర్ధం చేసుకోలేదు
నన్ను
అవమానమే మిగిలింది
నాకు...
పరాజయం అంచున అందరూ
వదిలేసారు నన్ను
అయినవారూ దాటిపోయారు
నన్ను...
జీవన బాటలో
అడుగుల జాడల్లో
నన్ను చూసుకున్నా నేను...
అందరున్నా
ఎవరూ లేని అనాధనే నేను
...
నాకు స్నేహం కావాలి
ప్రియమైన నేస్తం
కావాలి...
నా మనసుకు ఓదార్పు
కావాలి
నా గోడు వినే మనసు
కావాలి...
ఎవరూ లేరని నాకు
తెలుసు
ఎవరూ రారని నాకు
తెలుసు...
లోకంపై అసలు నమ్మకమే
లేదు నాకు
సమాజంపై అసహ్యం నాకు...
అయినా నాకు నేస్తం
కావాలి
నన్ను ఓదార్చే హృదయం
కావాలి...
దేవుడా ఎవరూ రారని
తెలుసు
ఎవరినీ నమ్మను నేను...
దేవుడా అది నువ్వే
ఎందుకు కాకూడదు...
నాకు నేస్తం నువ్వే
కావచ్చుగా
నా ఓదార్పు నువ్వే
కావచ్చుగా ...
నిజాలు అబద్దాలు అన్నీ
నీకు తెలుసు
మంచీ చెడూ అన్నీ నీకే
తెలుసు...
దేవుడా మరి నాతో
స్నేహం చేస్తావా
నా కన్నీరు తుడుస్తావా...
ఎన్నో సార్లు నాకు
నీపై కోపం వచ్చింది
ఎన్నోసార్లు నిన్ను
తిరస్కరించాను...
ఇప్పుడు నువ్వే
దిక్కని అనుకుంటున్నా
నువ్వే ఫ్రెండ్ అని
నమ్ముతున్నా...
అందుకే మనస్పూర్తిగా
నీకు పంపిస్తున్నా
నా ఫ్రెండ్ రిక్వెస్ట్...
No comments:
Post a Comment