నేను శతృవునే
నేను శతృవుని
ఎలా అయ్యాను
ఏ కోణంలో నేను
విరోధినయ్యాను...
ఏ విధమైన
పాపంలో పాలు పంచుకున్నాను...
నేనెప్పుడూ
కుట్రలు చేయలేదు
మైండ్ మాట
ఎన్నడూ వినలేదు...
చెవిలో ఇల్లు
కట్టుకున్న వారిని ఎన్నడూ నమ్మలేదు
మనసు
చెప్పిందే విన్నా
మనసు
చెప్పిందే చేశా ...
నేనెప్పుడూ
మోసం చేయలేదు
నేనెప్పుడూ
పారిపోలేదు...
సమస్యలతో
సమరమే నాజీవితం
అలుపెరుగని
పోరాటమే నా లక్ష్యం ...
మనసు మాట
కాదనక
ముళ్ళ బాటనే
పూల బాటనుకున్నా...
ఒక్కొక్కటి
జారిపోతున్నా
మనసునే
నమ్ముకున్నా ...
పోరుబాటలో
అలసిన మనసు
మనసునే
ప్రశ్నిస్తే ...
ఈటెల వంటి
మాటలకు
సమాధానాలే
ఇస్తే
అదే
పాపమయ్యింది...
నిగ్గదీసి
నిలదీస్తే
అదే
నేరమయ్యింది...
సమాజమా నేను
శతృవునే
ఆ మనసుకు నేను
విరోధినే
ఆ మనసు మాత్రం
నాకు ప్రియమైనదే...
No comments:
Post a Comment