అబద్దాలే నిజాలైతే
అంతా నిజమే
అయితే ఎంత బాగుండేది ...
నీవు
చెప్పినవి అన్నీ నిజాలే అయితే
ఎంత
బాగుండేది...
నీవు
చెప్పినవన్నీ నాదగ్గర ఉంటే
ఎంత
బాగుండేది...
నా దగ్గర
ఉన్నాయని నువ్వన్నవి అన్నీ
నిజమే అయితే
ఎంత బాగుండేది
...
నా జీవితం
విరిసిన పూలతోట అన్నావ్
నా ప్రతి
మలుపులో పువ్వులే అన్నావ్...
ప్రతి
పువ్వుతో నాకు
నిత్యం అనుభవమన్నావ్
ఆ అనుభవమే
నిజమైతే ఎంత బాగుండేది..
కాణి గాని
వాడిని
కనకమ్ములే
ఉన్నాయన్నావ్
నిజమే
అది నిజమే అది
నిజమే అయితే
ఎంత బాగుండేది
...
సిరి సంపదలే
నా ఆశయమన్నావ్
ఆ సంపదే ఉంటే
ఎంత
బాగుండేది...
నీ ప్రతి
పలుకు నిజమే అయితే
నా ప్రతి
అడుగు పూలబాట కాదా...
నాకూ అన్నీ
కావాలని ఉంది
అన్నీ సొంతం
చేసుకోవాలని ఉంది...
అందమైన
ముద్దబంతులూ
సిరిసంపదల
రాశులు ...
దేవుడా ఆ
అబద్దాలన్నీ
నిజం
చెయ్యవా...
No comments:
Post a Comment