అస్త్ర సన్యాసం
ఎవరితో పోరాటం
ఎందుకు ఈ
చెలగాటం ...
నేను చెయ్యను
పోరాటం
నాకు లేదు
ఆరాటం ...
మనసైన నా మనసు
మనసుతోనే
పోరాటం చేస్తుందా...
ఇది నా మనసు
ఇది నా
సర్వస్వం
ఇదే
నాజీవితమని
చెప్పుకున్న
మనసు
మళ్ళీ మన్సుతోనే
పోరాడుతుందా...
రగులుతున్న ఆ
మనసూ నాదే
ఆ వేదనకు
కారణమూ నేనే
ఎలా
పోరాడుతుంది మనసు....
ఎందుకు
పోరాడాలి
ఎవరితో
పోరాడాలి...
చెయ్యి
విడిచింది మనసు
మరో మనసుకోసమే
నంటూ
గేలి చేసే
లోకంతో పోరాడాలా...
ఆ మనసు మరో
మనసు
నీడన చేరాలని తపిస్తే
ఈ మనసు
ఆపగలదా...
మనసులను
కట్టడి చేసే
మనుషులున్నారా
లోకంలో...
మరెందుకు సమరం
ఎందుకు అర్థం
లేని పోరాటం...
విరిగిన మనసు
ముక్కలను
అతికించాలనుకునే
సమాజాన్ని కాదు నేను...
పగిలిన మనసుకు
ఈ మనసులో
స్వాంతన లేదని తెలుసు నాకు...
ఆ మనసు విజయమే
ఈ మనసుకు
ఆనందం ...
ఆ మనసుకు
మనసైన
స్వాంతన
దొరకాలనే ఈ మనసు ఆరాటం...
అందుకే
ఏనాటికీ చేయదు
ఈ మనసు
పోరాటం...
మనసైన మనసుకోసం
చేస్తోంది
ఈ మనసు అస్త్ర
సన్యాసం...
No comments:
Post a Comment