మనీ మైండ్
మనీ మనీ మనీ
నేనెప్పుడూ
మనీతో అలోచించలేదు...
మనసుతోనే
అలోచించా
అన్నీ మనసుతోనే
చూసా ...
మనీ అనే
అద్దంలో అందరూ లోకాన్ని చూపినా
నేను కన్నులు
మూసుకున్నా ...
మనసు మాటే
విన్నా
మనసు
చెప్పిందే చేసా...
మనీకన్నా మనసే
గొప్పదని నమ్మా
వచ్చీ పోయే
మనీ కన్నా
మనసే పదిలమని
అనుకున్నా ...
నీకు మనసే
లేదని అన్నా
నీలాంటి మనిషే
ఉండడని నిష్ఠూరమాడినా
మనిషినే నేనని
మురిసిపోయా...
గడియారం
ముల్లులా కాలం తిరుగుతూ ఉంటే
ఒక్కో రోజు
ఒక్కో అనుభవం ...
మనీ లేనిదే
అడుగు తీసి అడుగు వెయ్యలేని వైనం
మనీ లేనిదే
శ్వాస కూడా తీయలేని దైన్యం ...
అనుకోవటానికి
అందరూ ఉన్నా
మనీ లేని నాకు
ఎవరూ లేరనిపించిన సమయం...
ఎత్తులు వేసే
సమాజానికి సవాల్ విసరాలన్నా మనీ
పోరాటంలో
ముందుకు సాగాలన్నా మనీ
అన్నింటికీ
మనీ ...
మనసైన మనసును
నమ్మించాలన్నా
తోడూ నీడగా
నిలవాలన్నా
నమ్ముకున్న
వారి కడుపులు నింపాలన్నా
మనీ మనీ
మనీ...
మనీ లేనిదే
నమ్మకం లేదు
మనీ లేని
బంధానికి విలువే లేదు...
నిజంగా నేను
మనీ మనిషినే అయితే
ఇలా ఓటమి
అంచున జారిపోయేవాడినా ...
ఇప్పుడు
అనిపిస్తోంది నాకు
మనీ మనిషిగా
మారాలని...
మనసుతో కాదు
మనీ మైండ్ తో
బతకాలనీ...
No comments:
Post a Comment