I AM PROUD OF MYSELF. (PART-1)
గల్లీ నుండే నా జర్నలిజం కెరీర్ మొదలైంది.
శివరాంపల్లి, ఎజి యూనివర్సిటీ డేట్ లైన్లతో ఈనాడు స్ట్రింగర్ గా నా ప్రస్థానం
మొదలైనా అంచెలంచెలుగా ఎల్లలు దాటి ముందుకు సాగాను. స్టేట్ క్రైమ్ బ్యూరో స్థాయికి
ఎదిగాను. ఉన్న జీతంతోనే సరిపెట్టుకున్నా గానీ నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలని
అడ్డదారులు తొక్కలేదు. చాలా అవకాశాలు వచ్చాయి. నేను వాడుకోలేదు. అదే చేసి ఉంటే
ఈరోజు అద్దాలమేడలో ఇంటి ముందు నాలుగు కార్లు. ఫుల్లు బ్యాంకు బ్యాలెన్స్ తో
ఉండేవాడిని. మనీ వెంట పరుగులు తీయలేదు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు గానీ
ఇప్పుడున్న తృప్తి మాత్రం ఉండేది కాదు. ఏటికి ఎదురీదుతున్నా నేను నాలాగే ఉన్నందుకు
సంతోషంగా ఉన్నా.
గ్రేట్ సర్ , కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు అలా లేదు . ఏకంగా యజమానులే ఇంకొకిరికి సెల్యూట్ చేస్తుంటే , ఉద్యోగులు మాత్రం ఎం చేస్తారు , యధా యజమాని తధా ఉద్యోగులు . ఇప్పుడు మరీ దారుణంగా అయిపొయింది . నా చిన్నప్పుడు జర్నలిజం అంటే భలే హుషారు గా ఉండేది , ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాంటివి చాలా ఆశక్తి గా ఉండేది , వయసు తో బాటు బుర్ర పెరిగే కొద్దీ , మారిపోయిన కాలాన్ని , జనాలని చూస్తుంటే ఆశ్చర్యంగా , విసుగ్గా ఉంటుంది. ఊళ్ళో జర్నలిస్ట్ ల కథలు వింటుంటే బుర్ర తిరిగిపోతుంది .
ReplyDeleteఆ రోజులే వేరు
Deleteమీ లాంటి జర్నలిస్టులు ఇప్పుడు లేరు.జర్నలిజం పేరుతో బ్లాక్ మెయిలీంగ్ చేసి లబ్దిపొందేవారే ఎక్కువ.అసలు ఈ రంగములో అందుకోసమే అడుగుపెడుతున్నారు కూడా.జీవనసాఫల్యపురస్కారం వృత్తిసాఫల్యపురస్కారం ఉంటే.. అది మీలాంటి నిజాయితీపరులకే చెందాలి.కానీ దురదృష్టవశాత్తు అవికూడా అవినీతిపరులఖాతాలోకే చేరుతున్నాయ్.మీ ధర్మాచరణ దీక్ష వృథాకాదు అని నా విశ్వాసం.ధర్మోరక్షతి రక్షితః
ReplyDeleteగాదిరాజు మధుసూదన రాజు
ధన్యవాదములు సర్
ReplyDelete