డాక్టరేట్
మిస్సయ్యింది.(PART-11)
డాక్టర్ గౌసుద్దీన్ షేక్... ఎంత ఇంపుగా ఉంది ఇలా
రాసుకుంటే... నిజంగా నాపేరుకు ముందు డాక్టర్ అని రాసుకునే అవకాశం మిస్సయ్యింది..
అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే నేను డాక్టర్ నైపోయేవాడిని.. డాక్టర్ అంటే
జ్వరం వచ్చినప్పుడు సూదులు గుచ్చే డాక్టర్ కాదండి బాబూ... గౌరవ డాక్టరేట్ అనమాట..
అదెలా అంటారా.. నా జర్నలిజం చరిత్రలో ఒకసారి ఈనాడు నాటి పేజీలను
తడిమిచూడాల్సిందే.. ఈనాడులో ఏజీ యూనివర్సిటీ డేట్ లైన్ తో వార్తలు రాసే సమయంలో
నేను యూనివర్సిటీలో ఒక భాగమైపోయాను అనే విషయం ఇప్పటికే చెప్పుకున్నాను. నాతోపాటు
వేరే పత్రికలకూ లోకల్ రిపోర్టర్స్ ఉండేవారు కానీ వాళ్ళు యూనివర్సిటీ రాజకీయాలు
విద్యార్థుల గొడవలు, ప్రెస్ మీట్లు, సెమినార్లకే పరిమితమయ్యేవారు. నేను ఇవన్నీ
చేస్తూనే ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుపై ఫోకస్ చేసాను. అదే వ్యవసాయ
పరిశోధన.వ్యవసాయవిశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న పరిశోధనలపై వార్తలు రాయటం
మొదలుపెట్టాను. మొదట్లో ఆధునిక వ్యవసాయ పనిముట్లు, విద్యార్థుల పరిశోధనా
క్షేత్రాలపై స్టోరీస్ రాసాను. నా ఆర్టికల్స్ యూనివర్సిటీ అధికారులకు బాగా నచ్చేవి.
సహజంగానే ఈనాడులోనూ వ్యవసాయ వార్తలకు బాగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈనాడుకు అన్నదాత
పేరుతో ఒక మాసపత్రిక ఉన్న విషయం తెలిసిందే. నా కథనాలు నచ్చిన యూనివర్సిటీ నన్ను
ఇంకా ప్రోత్సాహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ పరిశోధనా కేంద్రాలను
సందర్శించాల్సిందిగా నన్ను కోరింది. ఇందుకు మా ఆఫీసు అనుమతి కూడా ఈజీగానే
దొరికింది. అప్పటినుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని పరిశోధనా
కేంద్రాలకు క్యాంపులు పెట్టుకున్నా. యానివర్సిటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డాక్టర్
పండరీనాథ్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ జయరామిరెడ్డి లు ఎప్పుడూ నాకు తోడుగా
ఉండేవారు. ఆయాకేంద్రాలలో జరుగుతున్న పరిశోధనలు, కొత్తవంగడాల ప్రత్యేకతలు,
పాడిపంటలు వంటి అంశాలపై వందల ఆర్టికల్స్ రాసాను. ఇవి చూసిన అన్నదాత ఎడిటర్
వాసిరెడ్డి నారాయణరావు గారు వీటిలో తనకు నచ్చిన ఆర్టికల్స్ ని నా పేరుతో అన్నదాత
మ్యాగజైన్ లో ప్రచురించేవారు. ఇదేసమయంలో న్యూస్ టైం ఇంగ్లిష్ పేపర్ బ్యాక్
పేజీలోను నా ఆర్టికల్స్ వచ్చేవి. ఇలా రాసిన ఆర్టికల్స్ అన్నిటిని యూనివర్సిటీ
ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఒక రికార్డు రూపంలో సేకరించేది. అయితే యూనివర్సిటీ వైస్
ఛాన్సలర్ డాకర్ట్ mv రావు గారికి నా ఆర్టికల్స్ బాగా నచ్చేవి. ఆయన యూనివర్సిటీ
సెమినార్లు వర్క్ షాపుల్లో నాకు ఖచ్చితంగా భాగస్వామ్యం ఉండేలా చూసేవారు. ఒక దశలో
శాస్త్రవేత్తలతో మంచి అవగాహనతో చర్చల్లో పాల్గొనేవాడిని. ఇదంతా గమనించిన డాక్టర్
mv రావు గారు గౌస్ ఆర్టికల్స్ అన్నింటిని ఒక పుస్తకరూపంలో చేసి నీకు డాక్టరేట్
ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. అయితే కొన్ని
అనూహ్యపరిణామాల నేపథ్యంలో నేను ఈనాడు ను వదిలేయటం, రావు గారు రిటైర్ కావడం
జరిగింది. అలా నా డాక్టరేట్ మిస్సయ్యింది. నేను ఈనాడును ఎందుకు వదిలేసానో కూడా
చెబుతా తర్వాత అది కూడా ఇంట్రస్టింగ్ స్టోరీయే...
No comments:
Post a Comment