మిస్టర్
వాత్సాయన...
(నేనే
) (PART-12)
అప్పట్లో అంటే సిటీకేబుల్ టైంలో మనకు రెండు నిక్
నేమ్ లు ఉండేవి. వాటిలో ఒకటి వాత్సాయన.. రెండో పేరు సందర్భం వచ్చినప్పుడు చెబుతా
ఇదే ఎపిసోడ్ లో.. సిటీ కేబుల్ తొలినాళ్లలో మనకు క్రైమ్ తో సంబంధం లేదనే విషయం
తెలిసిందే.. ఒకరోజు ఏదన్నా స్పెషల్ స్టోరీ చేయాలి అనుకుంటూ పేపర్లు మ్యాగజైన్లు
తిరిగేస్తున్నా.. అప్పుడు ఒక అడల్ట్ సమస్యపై కథనం కనిపించింది. దీనిపై స్టోరీ
చేస్తే ఎలా ఉంటుంది సార్ అంటూ మా న్యూస్ డైరెక్టర్ రవిప్రకాష్ గారిని అడిగా.. ఆయన
ఫుల్లు ఇంప్రెస్స్ అయ్యి నాకు ఒక డాక్టర్ ఫోన్ నంబర్ ఇచ్చి ఆయన ఇంటర్వ్యూ తో
స్టోరీ చేయమన్నారు. ఆ డాక్టర్ ఎవరో తెలుసా ప్రముఖ సెక్సాలజిస్ట్ కంభంపాటి
స్వయంప్రకాష్. సోమాజీగూడాలో ఆయన ఉండేవారు. వెళ్లికలిసాను అంతే మన స్టోరీల స్టయిలే
మారిపోయింది. వారంలో రెండు స్టోరీలు సెక్స్ సంబంధిత విషయాలపై చేసేవాడిని.
శృంగారపరమైన సమస్యలు, ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలంటే ఏం చేయాలి. మగువలు తమ
భాగస్వామిని ఆకట్టుకునే పద్ధతులు వంటి అంశాలపై రెగ్యులర్ స్టోరీలు ఇచ్చేవాడిని. ఒక
రకంగా కంభంపాటి నాకు చాలా క్లోస్ అయ్యారు. ఇదంతా బాగుంది ఈ స్టోరీలతో నాకు ఆఫీసులో
విపరీతమైన క్రేజ్.. కొందరైతే మా ఫ్రెండ్ కు ఈ ప్రాబ్లమ్ ఉంది ఏం చేయాలి అంటూ తమ
సమస్యలే ఇండైరెక్ట్ గా నాకు చెప్పేవారు. మనకేమో కంభంపాటి చెప్పినవన్నీ మైండ్ లో
స్టాక్ ఉండేవి. వాళ్ళడిగిన ప్రశ్నలకు ఒక సెక్సాలజిస్ట్ తరహాలో జవాబులు
చెప్పేవాడిని. అప్పుడే ఆఫీసులో నాకు మిస్టర్ వాత్సాయన అంటూ పేరొచ్చింది.అందరూ
వాత్సాయన అంటూ టీజ్ చేసేవాళ్ళు. ఒకపేరు సరిపోలేదన్నట్టు మా మురళీకృష్ణ అదే ఇప్పుడు
tv9 మురళీకృష్ణ సడెన్ గా మిస్టర్ సెక్సుద్దీన్ అంటూ పిలిచాడు. అంతే అందరూ
వాత్సాయనను మరిచిపోయి సెక్సుద్దీన్ అంటూ పిలవడం స్టార్ట్ చేశారు రవిప్రకాష్ తో
సహా..
మురళి అంటే గుర్తొచ్చింది ఒక మంచి సరదా
సన్నివేశం. మా అసిస్టెంట్ డైరెక్టర్ జగన్ మెహన్ రెడ్డి (ఇప్పుడు tv9)గారి పెళ్లి.
ఆయన పెళ్ళికి వెళ్ళాలి. సిటీకి దాదాపు వందకిలోమీటర్ల పైనే దూరం ఉంటుంది. ఆరోజు
సాయంత్రం ఏడున్నరగంటల బులెటిన్ ముందే రెడీ చేసుకుని రెండు కార్లలో బయలుదేరాం. నేనూ
రవిప్రకాష్ గంగాధర్, బాల గంగాధర్, మా ఫైనాన్స్ మూర్తి ఒకకారులో మిగిలిన వారు మరో
కారులో బయలు దేరాం. మా అందరికి మందుతాగే అలవాటు. ఒక వైన్ షాపులో ఓల్డ్ మంక్
తీసుకుని దాన్ని థమ్స్ అప్ లో కలుపుకుని తాగుతూ వెళ్తున్నాం. మధ్యలో రెండు కార్లు
ఒక చోట ఆపాం. మరో కార్లో ఉన్న మురళి కృష్ణ మా దగ్గరకు వచ్చి మాకివ్వకుండా మీరంతా
థమ్స్ అప్ తాగుతున్నారు నాకూ కావాలంటూ మారాం చేసినట్టు అడిగాడు. పాపం మురళికి మందు
అలవాటు లేదు... నా దగ్గర కొద్దిగానే ఉంది నేనివ్వను అంటూ బాటిల్ సీటుకింద
దాచుకున్నా. అప్పుడు రవి గారికి ఓ కొంటె ఆలోచనవచ్చి... ఏం గౌస్ మురళి అంతగా
అడుగుతున్నాడు కొంచెం థమ్స్ అప్ ఇస్తే ఏం పోయింది అంటూ కన్నుగీటారు. నాకు సీన్
అర్ధమయ్యింది. సరే మురళీ కొంచెం తాగి ఇవ్వు అంటూ బాటిల్ ఇచ్చా.. అమ్మా ఇంకా
ఇస్తానా మొత్తం తాగేస్తా అంటూ నాన్ స్టాప్ గా మొత్తం లాగించేసాడు.. ఇక చూడాలి
పెళ్లింటికి వెళ్ళాక మురళి కుప్పిగంతులు.. కాకా ఆకాశం ఎందుకు కిందికి వస్తోంది...
భూమి ఎందుకు ఊగుతోంది అంటూ నానా హంగామా చేసాడు. చివరకు ఒక ఇంటి అరుగు మీద
ముడుచుకుని పడిపోయాడు. ఈ సంఘటన కొన్నేళ్ళపాటు మాకు ప్రతి చర్చలోనూ హాట్ టాపిక్కే.
సిటీకేబుల్ మాకు చాలా సరదాలను ఇచ్చింది. సతీష్ కమాల్, హరిప్రసాద్, జగన్
సార్,బాలమురళీకృష్ణ, గణేష్, బాలగంగాధర్ గారూ కెమెరామెన్లు అందరం ఒక ఫ్యామిలీగా
ఉండేవాళ్ళం. మా ఆఫీసు దగ్గర ఏజీ ఆఫీసు బ్యాక్ గెట్ దగ్గర ఒక చెట్టు కింద తరచుగా
మందు కొట్టేవాళ్ళం. ఆ ప్రాంతానికి ముద్దుగా గ్రీన్ పార్క్ అని పేరు పెట్టుకున్నాం.
అప్పుడప్పుడు రవిప్రకాశ్, జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు కూడా అక్కడికి వచ్చేవారు.
కానీ రవిగారు మందు తాగేవారు కాదు. మాకైతే గ్రీన్ పార్క్ ఒక మంచి రిలీఫ్ సెంటర్..
ఇవ్వాళ సాయంత్రం గ్రీన్ పార్క్ లో మందు కొట్టాలి అంటూ వేరే మిత్రులముందు బిల్డప్
ఇచ్చేవాళ్ళం. అబ్బా మీరు గ్రీన్ పార్క్ లో మందు తాగుతారా అని వాళ్లడిగితే యస్ అని
పొగరుగా తల ఎగరేసేవాళ్ళం. వాళ్లకేం తెలుసు మేము మందు కొట్టేది మా ఆఫీసు సందులో ఒక
చెట్టుకింద అని..ఇలా సిటీ కేబుల్ కెరీర్ లో సరదాలు కూడా ఉన్నాయి..
No comments:
Post a Comment