ఐ
లవ్ మీ...
ఇప్పుడిలా ఎందుకయ్యాను
అప్పుడలా చేయకుండా ఉంటే ఇప్పుడిలా జరిగేది కాదు
కదా...
నా దృష్టిలో ఇదంతా ట్రాష్...
అవును అప్పుడలా చేసినా ఇప్పుడిలా చేసినా
ఇష్టపడే చేసా ఇష్టపడి చేసిన దానికి చింత
ఎందుకు...?
గతంలో నేనేది చేసినా ఎలాంటి అడుగు వేసినా పూర్తి
స్పృహలో ఉండే చేసా.. లక్షల రూపాయల సంపాదనకు అవకాశం ఉన్నా జీతం డబ్బులకే అడ్జ్సస్ట్
అయ్యా.. ఆ లక్షలు ఇపుడు కోట్లుగా మారేవి అదివేరే విషయం. కానీ అప్పుడు నేను
సంతృప్తిగానే ఉన్నా.. కోట్ల రూపాయలు ఆ సంతృప్తిని ఇచ్చేవి కాదు నాకు. నా ప్రతి
నిర్ణయం, నా ప్రతి అడుగు, నా నడక, నా నడత నా మనసుకు అనుగుణంగానే జరిగాయి. అన్నీ నా
ఇష్టంతోనే జరిగినప్పుడు గతాన్ని ఎందుకు నిందిస్తా. ఇప్పుడు వేదనలు పలకరిస్తున్నాయి
సమస్యలు కత్తులు దూస్తున్నాయి అయినా నా గతాన్ని
నిందించను. అప్పుడైనా ఇప్పుడైనా నన్ను నేను అమితంగా ప్రేమిస్తూ నా నడతను
ఇష్టపడుతూనే ఉంటాను
మనసు మాటే వినడం తెలుసు గనుక.
ఇప్పుడు కూడా ఏదో అద్భుతం జరగాలని నేను
కోరుకోవటం లేదు
నా జీవన సంధ్యా సమయమిది ఆత్మాభిమానం
దెబ్బతినకుండా గౌరవప్రదంగానే చివరి అడుగులు పడాలని
ప్రయత్నం చేస్తున్నా
జీవించాలి కదా ఏదో ఒకలా..
పైగా నేనన్నా నా అభిప్రాయాలన్నా
నాకు చచ్చేటంత ప్రేమ
జీవిస్తా మరణం పలకరించేదాకా
నన్ను నేను ప్రేమిస్తూ...
No comments:
Post a Comment