Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 22 July 2020

గర్జించిన యుద్ధ నౌక..(PART-15)


గర్జించిన యుద్ధ నౌక..(PART-15)
గద్దర్ నాపై విరుచుకు పడ్డారు.. అమెరికా ఏజెంట్ అంటూ తిట్టిపోశారు.. ఒక రకంగా నాపై యుద్ధం ప్రకటించారు.. ఎందుకో తెలుసా... నా జర్నలిజం కెరీర్ లో ఇదీ ఒక ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ అనే చెప్పాలి.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంటే నాకు చాలా అభిమానం.. అప్పట్లో నాకు తెలిసిన నక్సలైట్ అంటే గద్దర్ మాత్రమే.. గద్దర్ ను నేను మొదటిసారిగా ఈనాడులో ఉన్నప్పుడు అగ్రికల్చరల్ యూనివర్సిటీలోనే చూసాను. ఆరోజు రాత్రి యూనివర్సిటీ మైదానంలో జరిగిన ఒక బహిరంగ సభకు గద్దర్ వచ్చారు. రాడికల్ నేత రమేష్ నన్ను గద్దర్ దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు గద్దర్ ను మళ్ళీ కలవలేకపోయాను. ఈనాడు ను వదిలి సిటీకేబుల్ ని దాటి జెమినిలో జాయిన్ అయ్యాక మళ్ళీ గద్దర్ ను కలిసాను. నక్సలైట్లకు సంబంధించి ఏ స్టోరీ చేసినా గద్దర్ బైట్ తీసుకోవడం నాకు కంపల్సరీ గా మారింది. గద్దర్ అందుబాటులో లేకపోతే వరవర రావు లేదా కల్యాణ రావు బైట్స్ తీసుకునే వాడిని. ఒక రకంగా గద్దర్ తో చాలా క్లోస్ గా మూవ్ అయ్యాను. అల్వాల్ లోని గద్దర్ ఇంటికి తరచుగా వెళ్లి అక్కడే ఇంటర్వ్యూ తీసుకునే వాడిని. ఆయన కూడా ఆప్యాయంగా గౌస్ భాయ్ అంటూ పిలిచేవారు. నేను ఎప్పుడు ఫోన్ చేసి పిలిచినా కాదనక స్టూడియో కు వచ్చేవారు.. అయితే ఒక సందర్భంలో గద్దర్ నాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను అమెరికా ఏజెంట్ అంటూ తిట్టిపోశారు. మా ఆఫీసులో నాకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చారు. ఒక రకంగా జెమిని ఆఫీసులో గజ్జె కట్టి నాపై విరుచుకు పడ్డారు. నేను ఎంతగానో అభిమానించే గద్దర్ నాపై యుద్ధం ఎందుకు ప్రకటించారు.. అసలు ఏం జరిగింది.. నేను అమెరికా ఏజెంట్ నా..
అసలు విషయానికి వస్తే... అప్పుడు నక్సలైట్ల ప్రాభవం నడుస్తున్న రోజులు.. తన విప్లవ గీతాలతో గద్దర్ వేలాది మందిని ప్రభావితం చేసిన రోజులు. పీపుల్స్ వార్ గ్రూపుతో సహా దేశంలోని నక్సలైట్ గ్రూపులన్నీ మావోయిస్టు పార్టీ గా ఒకే గొడుగు కిందికి వచ్చిన తరవాతి పరిణామం ఇది.. ఒకరోజు ఓ కీలక సమాచారం నాకు అందింది. మావోయిస్టు పార్టీ నుంచి గద్దర్ ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్న డాక్యుమెంట్ అది. అప్పటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అలియాస్ ఆర్కే అలియాస్ సాకేత్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో గద్దర్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు నాకు ఆ డాక్యుమెంట్ ద్వారా అర్ధమయ్యింది.. అప్పటికి ఇంకా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియదు. చాలా ఎక్స్ క్లూజివ్ మ్యాటర్ ఇది.. దీన్నెలాగైనా బ్రేక్ చేయాలని డిసైడ్ అయ్యా.. మా MD కిరణ్ గారు ఓకే అనేసారు.. మా డెస్క్ ఈ సమాచారంతో అద్భుతమైన కథనం తయారు చేసింది.. అంతే హాట్ హాట్ న్యూస్ జనంలోకి దూసుకుపోయింది.. ఈ వార్త ఒక సంచలనంగా మారింది. మావోయిస్టు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీడియాలో సందేహాలు మొదలయ్యాయి.. ముఖ్యంగా గద్దర్ ఈ వార్త చూసి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అసలు ఈ వార్త రాజ్యం కుట్ర అంటూ గౌస్ ఒక అమెరికా ఏజెంట్ అంటూ విరుచుకు పడ్డారు. మా ఎండీని కలిసి తప్పుడు వార్త ఎలా టెలికాస్ట్ చేస్తారంటూ నిలదీశారు. వేలమందితో జెమిని ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. నాకు తెలుసు నేను కరెక్ట్ న్యూస్ ఇచ్చానని. మా ఆఫీసులో సోకాల్డ్ నక్సల్స్ అభిమానులు నమ్మకున్నా మా మేనేజ్ మెంట్ నమ్మింది.. మేము వార్త ఆపలేదు. ఇలా రెండు మూడు రోజులు గడిచిపోయాయి.
తర్వాత ఏం జరిగింది.. ఓ ఫైన్ మార్నింగ్ ఈనాడులో వార్త వచ్చింది. మెయిన్ ఎడిషన్ లో గద్దర్ బహిష్కరణ అంటూ పెద్ద వార్త వచ్చింది. అప్పుడు జెమిని వార్త కరెక్ట్ అని అందరూ నమ్మాల్సివచ్చింది.. అయితే అప్పటికే గద్దర్ కు మావోయిస్టులనుంచి అధికారిక సమాచారం అందటంతో ఆయన సైలెంట్ అయ్యారు. తర్వాత కూడా ఆయన నాతో మామూలుగానే ఉన్నారు. సేమ్ యధావిధి సంబంధాలు కొనసాగాయి. అయితే మావోయిస్టులకు గద్దర్ ఎందుకు దూరమయ్యారు... మళ్ళీ ఎలా దగ్గరయ్యారు అనే విషయాలు మనకు అనవసరం..

No comments:

Post a Comment