ఇక ఆపేస్తున్నా
ఎందుకో నన్ను నేను ఒకసారి ఈ ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనిపించింది.. అందుకే గత కొన్నిరోజులుగా నా జర్నలిజం ప్రస్థానంలోని విశేషాలను ఒక్కొక్కటిగా రాస్తూ ఉన్నా.. అయితే వీటిపై నా శ్రీమతి వాణీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు రహస్యంగా ఉన్న విషయాలు ఓపెన్ కావడం వల్ల నాకు కొత్త సమస్యలు రావచ్చని ఆమె భయం. మా అమ్మాయి కూడా తల్లి అభిప్రాయాన్ని బలపరుస్తోంది. అందుకే ఈ సబ్జెక్ట్ కు బ్రేక్ వేసేస్తున్నా.. ఎందుకంటే ఇప్పటివరకు ఓ ఇరవై శాతం మాత్రమే రాసాను. ఇంకా చాలా ఉంది. ప్రమాదకరమైన ఘటనలున్నాయి. నిజమే అవన్నీ రాస్తే కొత్త సమస్యలు రావచ్చు. రాస్తాను కానీ ఇప్పుడే రివీల్ చేయను. అవన్నీ మిమ్మల్ని ఏదో ఒక రూపంలో పలకరిస్తాయి.అప్పటికి నేనుండకపోవచ్చు. అయితే సరదా సంఘటనలు గుర్తుకు వస్తే అవి రాస్తాను సరదాగానే. ఇప్పటి దాకా రాసినవాటికి స్పందించిన సహృదయులకు ధన్యవాదాలు
చాలా బాగా రాస్తున్నారు , ఇలాంటి తెర వెనక విషయాలు , చాలా కుతూహులంగా ఉంటాయి . మీ శ్రీమతి చెప్పేది కూడా నిజమే . నా బోడి సలహా ఏంటంటే , మీరు పుస్తక రూపం లో మీ అనుభవాలని కొన్ని గ్రంధస్తం చేయొచ్చు కదా ? మీరు ఖర్చు చేసే సమయానికి , ప్రయత్నానికి తగిన ప్రతిఫలం కూడా వస్తుంది , ఇలాంటివి అందరికి ఇంటరెస్ట్ గా కూడా ఉంటాయి .
ReplyDeleteధన్యవాదములు అండీ.. మీ సలహా బోడి ఎందుకవుతుంది. మంచి సలహానే చెప్పారు. థాంక్యూ
Delete
ReplyDeleteమంచి నిర్ణయం. బీ కేర్ఫుల్