పొగరుబోతు మొక్కనై..
జారి పడుతున్న నమ్మకాన్ని
లేపి నిలుపుతోంది పట్టుదల
నమ్మకానికి కొత్త ఊపిర్లు ఊదుతూ
కసి మంటలు రేపుతోంది
గుండెను తాకిన ఆవిరి సెగలు నమ్మకానికి
ప్రాణం పోస్తున్నాయి
ఓడుతున్న నమ్మకం
గెలిపిస్తున్న పట్టుదల గెలుపోటముల
రణంలో
మరణం గుండెలు చీల్చి
మళ్ళీ పుడతా
పుడమిగర్భం చీల్చి
తల ఎగరేసే
పొగరుబోతు మొక్కనై...
No comments:
Post a Comment