ఫ్రెష్ రక్తం...(PART-24)
ఆరోజు ఉదయం తొమ్మిది గంటల సమయం... నేను ఆఫీసులో న్యూస్ పేపర్
చదువుతూ టీ తాగుతూ కూర్చున్నా... ఇంకా అప్పటికి చాలామంది రాకపోవటంతో ఆఫీసులో
ప్రశాంతంగా ఉంది.. అంతలోనే మా తేజా హడావిడిగా దూసుకు వచ్చాడు.. ఆయాసంతో రొప్పుతూ
గౌస్ భాయ్ గౌస్ భాయ్ అంటూ అరిచినట్టే పిలిచాడు.. ఏమయ్యింది తేజా అని అడిగాను..
ఫ్రెష్ రక్తం.. ఇప్పుడే రోడ్డు మీద యాక్సిడెంట్ చూసాను.. డెడ్ బాడీ కూడా ప్రెష్
గానే ఉంది.. అర్జెంటుగా వెళ్లి షాట్స్ తీసుకోవాలి ప్రెష్ రక్తం.. ఎక్స్ క్లూజివ్
అంటూ ఎగ్జయిటింగ్ గా చెబుతున్నాడు.. ఫ్రెష్ రక్తం ఏంటి తేజా అంటూ అందరం నవ్వుకున్నాం..
క్రైమ్ న్యూస్ అంటే అంత ఉత్సుకత ఉండేది మా తేజాకు..
గురించి చెప్పుకోకుండా ఉండలేను.చాలా సరదా మనిషి.. ఏదైనా సరే
అందరికంటే ముందుగా అందరికంటే బాగా చూపించాలనే తపనకు తోడు కొంచెం అమాయకత్వం.. ఇక
తేజా ఆఫీస్ లో ఉన్నాడంటే నవ్వులే నవ్వులు... ఫ్రెష్ రక్తం ఇష్యూ అయితే ఇప్పటికీ
గుర్తు చేసుకుంటాం.. ఏం తేజా ఇవ్వాళ ఫ్రెష్ రక్తం ఎక్కడా దొరకలేదా అంటూ మా బాస్
రవిప్రకాశ్ రోజూ ఏడిపించేవారు అతన్ని..
సిటీకేబుల్ లో దాదాపుగా నా ప్రతి స్టోరీ కి కెమెరా మెన్ తేజానే..
అప్పట్లో మాకు న్యూస్ కవరేజి కి ఒకటే కార్ ఉండేది. మేము బైక్ మీదే కవరేజి కి
వెళ్ళేవాళ్ళం. అలా తేజా బైక్ మీద సిటీ దాటి కూడా వెళ్ళేవాళ్ళం.. ఇదంతా ఎందుకు
చెబుతున్నా అంటే నా కెరీర్ లో అనేక సంచలనాలకు కెమెరామెన్ తేజా మాత్రమే. అతను
లేనప్పుడు మాత్రమే ఇతర కెమెరామెన్స్ నాతో వచ్చేవారు. తేజాలో కొన్ని ప్రత్యేకతలు
కూడా ఉన్నాయి. శవాలను వీడియో తీయాలంటే తేజా మాత్రమే అని పేరుండేది. అదేంటి ఉలుకూ
పలుకూ లేకుండా పడుండే శవాలను వీడియో తీయడమూ గొప్పేనా అనుకోవద్దు. అదే అతని
ప్రత్యేకత.మేజర్ క్రైమ్ ఉన్నప్పుడు శవాల విజువల్స్ ఎంత అవసరమో తెలిసిందే.. రోడ్డు
మీద డెడ్ బాడీస్ ను ఎవరైనా వీడియో తీస్తారు.. అయితే తేజా మాత్రం మార్చురీలో
పోస్టుమార్టం జరుగుతున్న ప్రాంతంలోకి కూడా వెళ్లి చాలా క్యాజువల్ గా వీడియో
తీసేవాడు. మార్చురీ సిబ్బందితో అయితే ఈయనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉండేది. ఒక పక్క
శవాలు పడి ఉన్నా సిబ్బందితో సరదాగా మాట్లాడుతూ వాళ్లతో కలిసి కూల్ డ్రింక్స్,
కొబ్బరిబోండాలు తాగుతూ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లో ఉన్నట్టే ఉండేవాడు. నేనైతే శవాల
కంపు భరించలేక మూతికి కర్చీఫ్ కట్టుకుని ఎక్కడో దూరంగా నిలబడే వాడిని. ఈ రాక్షసుడు
అన్నీ కంప్లీట్ చేసుకుని అన్నా చలో పనైపోయింది అంటూ నవ్వుతూ బయటికి వచ్చేవాడు.. నా
దృష్టిలో ఇదంత మామూలు విషయం మాత్రం కాదు.
సిటీకేబుల్ జర్నీలో ప్రతి మలుపులో తేజా నాతో ఉన్నాడు.. పాతబస్తీలో
సిమీ గ్రూపు నా మీద దాడి చేసిన సమయంలోనూ నాతో ఉన్నది తనే.. ఇక మేమిద్దరం జూపార్క్
లో చేసిన స్టోరీలకైతే లెక్కే లేదు.. నేను వెళ్లిన ప్రతి క్రైమ్ స్టోరీలో నాతోనే
ఉంటూ నాతోపాటు ఇబ్బందులు పడినా ఎప్పుడూ నాతో కలిసి పని చేయడానికే ఇష్టపడేవాడు.. నా
జర్నలిజం కెరీర్ లో నాతో నడుస్తూ నా సంచలనాలకు దృశ్యరూపం కల్పించిన
కు కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేను.
థాంక్యూ తేజా..
No comments:
Post a Comment