బ్యాడ్ టైమ్...
ఈ బ్యాడ్ టైమ్ నాకు మంచి అనుభవాలే నేర్పింది... మనుషులూ మనసుల మతలబులు క్లియర్ గా అర్ధమయ్యాయి.. నాకు ఆరోగ్యం బాగాలేదని వారం కింద నేనే ప్రకటించుకున్నా.. ఈద్ నమాజ్ కు కూడా వెళ్లలేకపోతున్నా అని ఫేస్ బుక్ లో వాట్సాప్ స్టేటస్ లోనూ నా ఫోటో పెట్టి మరీ చెప్పుకున్నా.. మరుక్షణం నుంచి నా హెల్త్ గురించి అందరూ వాకబు చేయడం మొదలు పెట్టారు. Fb లో గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్లు, మెస్సెంజర్ లో మెసేజ్ లు, వాట్సాప్ లో పలకరింతలు, చాలామంది ఫోన్ కాల్స్ ఎలాగున్నావ్ గౌస్ భాయ్ అంటూ.. ఏడాదికి ఒకసారి కూడా మాట్లాడని వాళ్ళు ఎలాగోలా ఫోన్ నంబర్ పట్టుకుని కాల్ చేశారు. మొదటి రెండు రోజులు కొంచం శ్వాస ఇబ్బందిగా ఉండటం తో కాల్స్ అటెండ్ చేయలేకపోయా.. ఇంతమంది నా శ్రేయస్సును కోరుకుంటున్నారా అని కొంచెం ఆనందం కలిగింది
నిజంగానే బ్యాడ్ టైమ్ లో పలకరించిన వారి వల్ల చాలా రిలాక్స్ అయ్యాను..
బాధాకరమైన విషయం ఏమంటే నేను ఎవరికోసమైతే అనుక్షణం తాపత్రయ పడతానో వారి నుంచి ఒక్క కాల్ రాలేదు, వారందరికీ తెలుసు నాకు బాగాలేదని... వాళ్ళే నా రక్త సంబంధీకులు.. కనీసం ఎలా ఉన్నావని ఎవరూ పలకరించలేదు, పోనీ దూర ప్రాంతాల్లో ఉన్నారా అంటే అదీలేదు నా చుట్టుపక్కలే ఉంటారు.. అయితే నేను ఎవరినైతే పెద్దగా పట్టించుకోనో వాళ్ళు మాత్రం తల్లడిలిపోయారు. అదే మా అత్తింటి తరఫువాళ్ళు, నా బావమరుదులు.. ఒకడేమో ఫోన్ చేసి డాక్టర్ ను తీసుకు వస్తా అంటాడు, ఇంకోడేమో ఆక్సిజన్ కోసం భయపడవద్దు నేను ఆరెంజ్ చేస్తా అంటాడు.వాళ్ళ హడావిడి చూసి కొంచెం ఫీలయ్యాను, అప్పుడే అనిపించింది నాన్న ఎలాగూ లేరు కనీసం నాకు మామన్నా ఉండాల్సిందని.. అయితే మా అబ్బాయి అందరినీ సున్నితంగా తిరస్కరించాడు. వాళ్ళ ఆఫీస్ డాక్టర్ సూచనల మేరకు నాకు మందులు ఇస్తూ జాగ్రతగా చూసుకున్నాడు. కొన్ని ట్యాబ్లేట్ లు దొరకకపోతే సిటీ లో ఎక్కడెక్కడో తిరిగి తెస్తున్నాడు. సరే కొడుకుగా వాడు బాధ్యత నెరవేరుస్తున్నాడు.అది గొప్పవిషయం కాకపోవచ్చు.. కానీ నా ఆరోగ్యం బాగుపడాలని విషెస్ చెప్పిన వందలాది మందిని చూసి ఆనందించాలా... కనీసం పలకరించలేని గుప్పెడంత మంది రక్తసంబంధీకులను చూసి బాధ పడాలా.. ఎవరు నా శ్రేయోభిలాషులు? బ్యాడ్ టైమ్ నా పై విసురుతున్న
ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పుకోను...
నిజమా,? మీరు ఆల్రెడీ కోలుకున్నానని రాశారు , సంతోషం . జాగ్రత్తగా , ప్రశాంతంగా ఉండండి . ఇక మనుషులు అంటారా? మీకున్న అనుభవాలు ప్రతీ ఒక్కరి జీవితం లో ఉన్నాయి. దగ్గర మనుషులు దూరం అయిపోతారు , దూరపు మనుషులు దగ్గర అవుతారు. No one is exception. మీరు పూర్తిగా కోలుకోవాలని ఆశీస్తూ ..
ReplyDeleteధన్యవాదములు సర్ 🙏🌹
DeleteI hope you will feel better soon ! Listen to your favorite songs, talk to the only people who love you and remind you of good times ONLY, keep smiling, see & feel the Sun twice a day, try not to think of people who bothered you....just to say in one simple sentence - surround yourself with good people, good thoughts, fresh air. Those things will definitely help. My Best of Best wishes for your quick recovery.
ReplyDeleteధన్యవాదములు అండీ..
Deleteమీ సూచనలు తప్పకుండా పాటిస్తాను.. నాకోసం సమయం వెచ్చించి ఒక స్ఫూర్తివంతమైన కామెంట్ పెట్టినందుకు థాంక్యూ 🙏🌹🙏
జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి.
ReplyDeleteధన్యవాదములు అండీ. 🌹
Delete.. ہوشیار رہو .. سلامت رہو .. یہاں تک کہ دن اچھ .ے نہیں ہیں
ReplyDeleteShukriya
Delete