నా అక్షరాలు
సిగ్గుతో వాలిన నీ కనురెప్పల చాటున
జారిపడే వెన్నెలలో
వికసించే కలువలే
నా అక్షరాలు...
విరిసే నీ అధరాల నవ్వుల వానలో తడిసే కైపులే
నా అక్షరాలు...
విరబోసిన నీ కురులలలో
గుబాళించే పరిమళాలే
నా అక్షరాలు...
నీ మృదువైన పాదాలను అల్లుకుని సవ్వడి చేసే
మంజీరాలే
నా అక్షరాలు...
నీ సాన్నిహిత్యంలో పొంగే
మధుకలశాలలో
అమృత ధారలే
నా అక్షరాలు...
నా మనసులో జనియించి
నీ చుట్టే తిరుగుతూ
నిన్ను నా కన్నా ఎక్కువగా
ఆరాధించే
నా అక్షరాలను చూసి
నాకే అసూయ కలుగుతోంది
మనస్వినీ...
అక్షర్ మేరె: అక్సర్ ముఝె దునియా సే మిలాతే హై
ReplyDeleteఅక్షర్ మేరె: అక్సర్ దిల్ కి బాత్ అన్కహి హి బతా దేతే హై
అక్షర్ మేరె: అక్సర్ సపనో మే తేరే యాదో కి ఛవి పెశాతే హై
అక్షర్ మేరె: అక్సర్ మేరె భావ్ మేరె అంతరంగ్ కో జతాతే హై
అక్షర్ మేరె: అక్సర్ ముఝె తేరే కరీబ్ లాతే హై
అక్షర్ మేరె: అక్సర్ దిల్ సే దిల్ తక్ పుల్ బనాతే హై
వాహ్ క్యా బాత్ హై
Deleteఫూల్ జైసే అక్షర్ కో
హమారా సలాం 🙏