తప్పదు మరో పోరాటం
ఏదీ నా స్వతంత్రం
ఏ కలుగున దాగింది
ఏ చీకటిన నక్కింది
అసలు ఎక్కడికి పోయింది
ఎక్కడ బంధీ అయ్యింది
ఆకలి కేకల మంటల్లో కాలిపోయిందా
బలవంతుల పదఘట్టనల్లో
నలిగిపోయిందా
కులాల కంచెల్లో చిక్కుకు పోయిందా
మతాల రొంపిలో కూరుకుపోయిందా
బందూకుల తూటాలకు
గుండెపగిలి చచ్చిపోయిందా
రాజకీయ రాబందుల గోర్లలో విలవిల లాడుతోందా
ఎక్కడుంది నా స్వతంత్రం
బోసిపోయిన త్రివర్ణ పతాకంలో ఇంకిపోయిందా
కపటనాటక పాలకుల బీరువాలో చెరపడిందా
ఎక్కడని వెతకను
ఎలా విడిపించను
తప్పదా మరో పోరాటం
నా స్వతంత్రతకు స్వేచ్ఛ కోసం
మీసం మెలేసి పూరించనా
మరో విప్లవ శంఖం..
No comments:
Post a Comment