Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 16 August 2020

పంక్ హోతేతో...


పంక్ హోతేతో...
నా మనసుకు రెక్కలున్నాయ్
నా భావాలు పక్షులై
ఎగురుతాయి...
నా దేహానికి ఎందుకు
లేవు రెక్కలు
నేనెందుకు ఎగురలేను
విహంగమై...
హస్రత్ సాహెబ్ ప్రవచనం
ఎంత మధురం
పంక్ హోతేతో ఉడ్ ఆతీరే
అంటూ ఎంతటి ఆరాటం...
మనసు ఎగిరినట్టే
నా భావం విహరించినట్టే
నా దేహమూ ఎగిరితే
ఓహ్... ఎంత అద్భుతమైన
భావం...
నేనే విహంగమైతే
రెక్కలు విచ్చుకుని
ఎగిరిపోనా
వెచ్చని నెచ్చెలి ఒడికి చేరి
మంచు బిందువులా కరిగిపోనా...

3 comments:

  1. కభీ కభీ ఇంతెజార్ కే పల్ కయీ లమ్హోఁ మేఁ బన్ జాతే హెఁ
    కభీ నఫరత్ కి పర్ఛాయి తో కభీ మహబ్బత్ కి తొహ్ఫా
    కభీ కినారా తో కభీ లహరెఁ మేఁ ఫఁసే హుయే పల్

    పల్కోఁ కే ప్యాలోఁ మేఁ ఆఁసుఓఁ సే భరా నజారా
    గగన్ తలే ఉడే పంఛి సాఫ్ మన్ కే ఉజీయారే మేఁ
    నయీ ఉమంగ్ సాథ్ లాయే ఏక్ నయీ తాకత్ సీ
    అల్బేలా హి సహి పతంగ్ కి తరహ్ ఉడాన్ భర్తే సప్నే అప్నే సారే
    యాదోఁ కో సమేటే.. నిఖార్ తే చలేఁ అఁధియారోఁ మేఁ ఉజియారే

    ~శ్రీత ధరణి

    ReplyDelete
    Replies
    1. వావ్...
      బహోత్ ఖూబ్...

      Delete
    2. ధన్యవాదాలు.. షబ్బ ఖైర్.. షేక్ సాహేబ్

      Delete