నీవు నా దానివే
ఎవరు
జనియించారు ఈ జగతిలో
నా మనసును
మార్చేందుకు
ఎవరు పుట్టారు
ఈ లోకంలో
నా మనసును
హతమార్చేందుకు
ఆగదు నా మనసు
గమనం
దిశమారనిది నా
మనసు పయనం
ఓసి
పిచ్చిమనసా
నా మనసు
భ్రమరం నీ నలువైపులే ఉంటుంది
అది ఎప్పుడూ
నీ చరణములనే ముద్దాడుతుంది
ఎన్నటికీ
తెలుసుకోలేవు మనసా నా మనసు లోతుల్ని
తాకలేవు మనసా
గుండెలో రగిలే గాయాల్ని
చూడలేవు మనసా
ఎదలో ఎగసిపడే సునామీలని
నువ్వు రమ్మని
పిలిచినా
పొమ్మని
తిరస్కరించినా
పిచ్చిది నా
మనసు
నీ చుట్టే
తిరుగుతుంది
మాటిస్తున్నా
మనసా
మారదు నా మనసు
నీ స్వాంతనను
స్వాగతిస్తుంది నా మనసు
నీ అడుగు
జాడలను చూస్తూ నిలబడిపోతుంది నా మనసు
నీ అడుగులను
ఇక ఎన్నడూ ప్రశ్నించదు నా మనసు
నీవు నా చెంత
ఉన్నా
నేను నీ చెంత
ఉన్నా
ఇక మౌన మునిలా
ఉండిపోతుంది మనసు
మనసా నీ
గమనాన్ని నిరోధించాలనుకోలేదు నా మనసు
హితం కోరే
స్పందించింది పిచ్చి మనసు
పేలని
అగ్నిపర్వతమే ఇక నా మనసు
రగిలే బాధలను
తనలోనే దాచుకుని
భావాలకు సమాధి
కడుతుంది ఇక నా మనసు
నీ మనసున నేను
లేకున్నా
నీవు
కనులముందు ఉంటే చాలని మారాం చేస్తోంది మనసు
బాస చేస్తోంది
మనసా నా మనసు
మనసుపై
అధికారం ఉండదని
అయినా వస్తూనే
ఉంటుంది మనసు నీ చెంతకు
మమకారాన్ని మానలేదు
నా మనసు ఎన్నడు
ప్రియమైన మనసా
నేను నీ
వాడిని కాలేకున్నా
నువ్వు నా దానివే
ఇది చాలదా నా మనసుకు...
వెర్రిమనసు ఎంత ముద్దొస్తుందో
ReplyDeleteతీపి గుర్తులు కదా ...
Deleteకాదన్నది ఎవరని :-)
ReplyDeleteThis comment has been removed by the author.
Delete