మబ్బు తునక మనసు
నీలి నింగిలో
తేలియాడే మబ్బు తునకను చూడు
అది
కదులుతున్న కొలది ఒక్కో రూపంలో కనిపిస్తుంది...
మనసు పెట్టి
చూస్తే
విరిసిన
పద్మంలా
జూలు
విదిల్చిన సింహంలా
వరాలిచ్చే
దైవంలా
కష్టాలు
బహుమతిగా ఇచ్చే దెయ్యంలా
కొలనులోని
మోసలిలా
కుబుసం
విడిచిన నాగులా
మబ్బులమ్మకు
రూపాలు ఎన్నెన్నో ...
మనసులోని
ఆలోచనలకు
అద్దం పట్టే
దూది పింజం ఆ మేఘపుష్పం ...
అది ఆ
మేఘమాలిక గొప్పదనం కానేకాదు
మబ్బులమ్మకు
అన్నిరూపాలు లేనే లేవు...
అది చూసే
కన్నులు
ఆలోచించే
మనసుకు అనుగుణంగా
రూపాలను
చూపుతుంది...
మనిషి మనసూ
ఇంతే
ఎదుటి వారిపై
కసి రేగితే
దైవమూ దయ్యంలా
దయ్యం దేవతా
మూర్తిగా
తాడు పాములా
పామే తాడులా
ఏదైనా
అనిపించవచ్చు...
మంచీ చెడూ
నిజం అబద్దం
అనురాగం
మోసం
అంతా మనసులోని
ఆలోచనలే...
ఏది నిజమో ఏది
అబద్దమో
తెలుసుకోలేని
మనసు
నింగిలోని
మబ్బు తునక వంటిదే
మనస్వినీ...
No comments:
Post a Comment