చివరి ప్రేమలేఖ
రాస్తున్నా
గుండె దిటవు చేసుకుని
అక్షరాలు
చిలికిస్తున్నా మనసు చంపుకుని
భావాల
అంతరంగాన్ని అంతం చేసాను
అక్షరాల గొంతు
నులిమేసాను
ఇక నా అక్షరం
పలకదు నీ నామాన్ని
నా భావం
వెల్లడించదు తనలోని ప్రేమని
నా కలంలో ప్రేమ
సిరా ఇంకిపోయింది
అక్షరాల రంగు
మారిపోయింది
భావాల గుండె
పగిలిపోయింది
నా
అక్షరామాలిక
పరిమళం లేని
పుష్పంలా మారింది
శ్వాస ఆగిన
అక్షరాలు నీకు ప్రణమిల్లుతున్నాయి
గుండె పగిలిన
భావాలు పుడమిని ముద్దాడుతున్నాయి
సునామీల
వెల్లువకు నా గుండె చెదిరి
అక్షరాలన్నీ
చెల్లా చెదురై వీడిపోతున్నాయి
కాలగమనంలో అవి
కొట్టుకుపోతున్నాయి
ఇక తిరిగిరావు
నా భావాలు
పరిమళించవు నా
అక్షరాలు
ఓడిపోయాయి
అంతరంగాలు
పగిలిన మనసులో
విరిగిన అక్షరాలు
నవలోకానికై
సాగిపోతున్నాయి
ఇక రానే
రామంటూ
చెదిరిన
మనసుకు వీడ్కోలు చెబుతున్నాయి
విరిగిన
అక్షరాలను
ముక్కలైన
భావాలను
కన్నీటితో
అతికించి
రాసుకుంటున్నా
చివరి ప్రేమ
లేఖ
No comments:
Post a Comment