Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 7 May 2015

దిల్ కో సలాం

దిల్ కో సలాం 

మనసున మనసై
మెలిగిన మనసే నిందలు మోపుతోంది...
చెమ్మగిల్లిన కనురెప్పల మాటున
ఉబికిన చుక్క సలాం చెబుతోంది...
మోసం తెలియని మనసునే
మోసమంటూ నిలదీస్తోంది...
పెదాలపై వాడిన చిరునవ్వు
పాదాలపై ప్రణమిల్లుతోంది...
తానేంటో తెలిసిన మనసు
నిందలనూ స్వీకరిస్తోంది...
మదిని మురిపించిన పువ్వే ఆ మనసైతే
ఆ పువ్వులోని ముళ్ళూ నావేనంటూ చేతులు జోడిస్తున్నది...
రగిలిపడే ఆవేశం ఆ మనసే అయితే
ఆ మంటలోనే స్నానానికి ఉవ్విళ్ళూరుతున్నది...
చల్లని వెన్నెల పంచిన ఆ మనసే నిప్పులు కురిస్తే
ఆత్మార్పణకు సిద్ధమని తలవంచుతున్నది...
అగ్నిపునీతం నా మనసు
నిందలనూ హిమగుళికల్లా
ఆరగిస్తుంది...
చివరి శ్వాస దాకా
దిల్ కో సలాం
మనస్వినీ...

No comments:

Post a Comment