పాపం పిచ్చి మనసు
ఆ అడుగుల
అలజడులు
ఇంకా ప్రకంపనలు
రేపుతూనే ఉన్నాయి...
ఆ అందియల
రవళులు
ఇంకా వినిపిస్తూనే
ఉన్నాయి...
ఆ నవ్వుల
పువ్వులు
ఇంకా
విరబూస్తూనే ఉన్నాయి...
ఆ కోయిల
గొంతుక గానం
వీనులలో విందు
చేస్తూనే ఉంది...
ఆ పెదాల
మెరుపులు
కళ్ళ ముందు
చిందులేస్తూనే ఉన్నాయి...
వాడిన వసంతం
ఇంకా పచ్చగానే
కనిపిస్తోంది...
అడుగు జాడలు
కరిగిపోయాయి
అందియలు
మూగబోయాయి ...
ఒక ప్రవాహమై
ఎగసిన అల
అంతా తుడిచేసింది...
అయినా మనసులో
అన్నీ సజీవంగానే ఉన్నాయి...
ప్రతి క్షణం
ప్రతి అనుభూతి
కనులముందే
నర్తిస్తున్నాయి...
పాపం పిచ్చి
మనసు
ఇంకా
ఆశపడుతోంది ...
No comments:
Post a Comment