నాదన్నది ఏమున్నది నీలో
ఆలి లోని
అనురాగం నీలోనే తెలుసుకున్నా
ప్రియురాలి
మధురిమ నీలోనే రుచి చూసా
అమ్మలోని
మమకారం నీ ఓడిలోనీ వెతుక్కున్నా
స్నేహమనే
సహకారం నీతోనే పంచుకున్నా
పసిబిడ్డ
కేరింతలు నీ నవ్వులోనే చూసుకున్నా
కవ్వించే
కొంటెదనం ఆ కన్నులలోనే దాచుకున్నా
అమ్మవై
గోరుముద్దలు తినిపించినా
ఆలివై అనురాగం
పంచినా
జవరాలివై
అధరామృతాలు అందించినా
ప్రియురాలివై
సర్వమూ ధారపోసినా
అన్నీ నావే
అనుకున్నా
సర్వమూ నేనే
అనుకున్నా
నాజీవనవనంలో
అందమైన
పూదోటవే అనుకున్నా
నాదన్నది ఏదీ
లేదని
ఇప్పుడు
తెలుసుకున్నా
నీకన్నులలో
నేను కరిగిన కలనేననీ
నీ మనసులో
నేను లేనే లేనని అర్ధం చేసుకున్నా
నేను నీలో
లేకున్నా
నేను నీకేమీ
కాకున్నా
నీ జ్ఞాపకాలు
మాత్రం పదిలంగానే ఉంటాయి
నా గుండెలో
నాది కాని
మనసుకోసం కలత చెందను
గీసిన గీత
హద్దు దాటను
అంతిమ ఘడియలు
నన్ను చుట్టుముట్టినా
ఆ మనసును
పలకరించను
చాలవా నాకు ఆ
జ్ఞాపకాలు
ఊపిరిపోసుకోవటానికి
No comments:
Post a Comment