మై
డియర్ మనసా నన్నెందుకు చంపావ్
ఎవరినీ
నిందించలేను మనసా
ఎవరూ కారణం
కాదు మనసా...
ఊహ తెలిసిన
నాటినుంచి నిన్నే నమ్ముకున్నాను
ప్రతి అడుగు
నీ జాడలోనే వేసాను
నాటి నుంచి
నేటిదాకా
నీవు
చెప్పినదే చేసాను...
కాలమనే విషనాగు
ఎన్ని పరీక్షలు పెట్టినా
నీ మార్గంలో నడిచి
గెలిచాను...
ప్రతి సమయం
ప్రతి గమనం
నీకే
అంకితమిచ్చాను...
ఎవరు ఎన్ని
చెప్పినా
వాడు మనసు
చెప్పిందే వింటాడు అని
కితాబులందుకున్నాను...
మనసా ఒకసారి
నిజం చెప్పు
నేను నీ
అడుగుల జాడ కాలేదా...
మరి
ఇప్పుడేమిటి ఇలా
నా మనసువైన
నువ్వు నన్నే మోసం చేసావు...
నీ మాట వినే
కదా
నేను అడుగులు
చేసాను...
సమస్యలు సుడిగుండములై
చుట్టుముట్టినా
అడుగులు
పక్కదారి పోతున్నాయని
ఎందరు
వారించినా
నీ మాటే
విన్నాగా మనసా...
కుట్రలు
కుతంత్రాలు నాకు నువ్వు నేర్పలేదు
మాయలు
మంత్రాలు చెప్పలేదు
మరెందుకు మనసా
నేను ఒంటరినయ్యాను...
మనసా నిన్ను
నమ్ముకున్న పాపమేనా
నా ఈ పతనం...
నాలోని మనసువో
దేహంలోని
అంతరాత్మవో
నువ్వేగా
నన్ను ముందుకు నడిపావు...
నువ్వేగా
ప్రేమను నేర్పావు
అనురాగంలో
ఓనమాలు దిద్దావు...
మరో మనసును
నిందించలేను
ఆ మనసు
చెప్పిందా ఇలా చేయమని...
ఆ మనసు
కోరుకుందా
పతనం
కావాలని...
సమాజం
చెప్పిందా
నడతను
మార్చుకోమని...
ఎవరూ నా
వేలుపట్టి నడపలేదు
నాకు నడత
నేర్పింది నువ్వు కాదా మనసా...
మరి ఎవరినో
ఎలా నిందించను మనసా
ఎవరు చేసారు
ద్రోహం మనసా...
నాలోనే ఉన్న
నీవు
నా అడుగులు
సవరించి ఉంటే
నా అంతం ఇంత
దారుణంగా ఉండేదా మనసా...
నా కణం కణంలో
నా అంతరంగంలో
అణువు అణువులో
నీవై ఉన్న నిన్ను
నమ్ముకోవడమే
నేను చేసిన
పాపమా మనసా...
మనసా ఏం
మిగిలింది నీకు
ఇప్పుడు ఎవరు
మిగిలారు నాకు
నన్ను మనిషిగా
చంపిన నిన్ను
ఎలా మన్నించగలను
మనసా...
నాలోనే ఉండి
నన్ను అంతం చేసిన నిన్ను
దహియించక ఎలా
ఉండగలను మనసా...
మనసా కాలిపో
నాలో మసి
అవుతున్న జ్ఞాపకాలుగా...
రగిలిపోయి
గాలిలో కలిసిపో
తిరిగిరాని
శ్వాసలా...
ఇంకా నీ మాటే
వింటా
బాట మార్చి
అంతిమ తీర్పు చెప్పు
నాకు
మరణశాసనంలా...
No comments:
Post a Comment