ఓ పిచ్చి మనసు నిరీక్షణ
పలకరించిన
మనసుకు
పులకరించింది
మనసు
పరవశించిన
పలుకుకు
నర్తించింది
మనసు
ఎలా ఉన్నావ్
కన్నా
నన్నొదిలేసి
ఎలా ఉంటున్నావ్
నన్నింత
ప్రేమిస్తావ్ గా
దూరాన్నెలా భరిస్తున్నావ్
మంద్రంగా
వచ్చిన ప్రశ్నకు
మూగబోయింది
మనసు
బదులు
చెప్పలేక తటపటాయించింది మనసు
మనసు మారిందని
మనసు మురిసింది
భేషజాలు
వదిలేసి
కల్మషాలు
విసిరేసి
మలినాలు
తుడిచేసి
చేరువవుతోందని
వికసించింది మనసు
మనసు ఒడిలో
వాలిపోవాలని
ఎడబాటు ముళ్ళనుంచి
సేదతీరాలనీ
మంటలు రేపిన
గాయాలకు
మమతల లేపనం
అద్దాలనీ
మనసు గుడిలో
చిరుదీపమై
మళ్ళీ
వెలిగిపోవాలనీ
అనురాగాన్ని
అనుబంధంతో పెనవేయాలనీ
ఉద్విగ్నతలో
తడిసి ముద్దయ్యింది మనసు
అది ఆశకాదు
అడియాసేనని
ఆ పలకరింపు
గాలిబుడగ వంటిదేనని
ఆ మనసు అన్ని
నిజాలు తెలిసినా
అబద్దాలనే
పాతగాయాలలోనే మునిగితేలుతోందనీ
తనలో
రేగుతున్న ఆవేశానికి బానిసగా మారిందనీ
మనసులో
ఎన్నటికీ మార్పు రానేరాదనీ
స్వల్ప ఘడియల్లోనే
తెలుసుకుంది మనసు
మరపురాని
మనసులో మార్పుకోసం
ఇంకా
ఎదురుచూస్తూనే ఉంది మనసు
అనుమానపు
అంచులలో
ఆవేశం
పరదాల్లో
ముళ్ళ
ముసుగును కప్పుకున్న మనసు
అన్నీ
విసిరేసి
మనసైన
మనసుకోసం
మలయమారుతంలా
నిండైన
వసంతంలా
తరలివస్తుందని
ఇంకా నమ్ముతూనే ఉంది
ఓ పిచ్చిమనసు ...
some waitings are endless...
ReplyDeletefor the one who is heartless...