Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 13 May 2015

ఆఖరి అడుగులు

ఆఖరి అడుగులు



గాయపడిన మనసు గమ్యం వెతుకుతున్నది
గమ్యమే తెలియని మనసు అడుగులు తప్పుతున్నది ...
దూరమైన వసంతాన్ని అన్వేషిస్తూ
ఎండమావులలో మునిగితేలుతున్నది ...
రంగుల లోకంలో అంతా మాయాజాలమే
మనసుకు ఈ నిజం తెలిసినది ...
ప్రతి మాటలో మోసం
ప్రతి అడుగులో మాయ ...
ఇంద్రుడివి నీవు
చంద్రుడు నీవు
మంచితనానికి రారాజువి నీవు
చక్కర పలుకులు విసిరే మనసులు
చేయూతనిచ్చేది భస్మాసుర హస్తాలే ...
ఆసరా ఉంటామని భరోసా ఇచ్చే
అనుబంధాల మనుషులు
చివరకు మారేది మరమనుషులుగానే ...
ఎవరి ఆలోచన వారిదే
ఎవరి మనసు వారిదే
కూడలి మార్గంలో అనాధగా మిగిలిన మనసు
నిష్ఫల మార్గంలో అడుగులు వేస్తున్నది ...
మనసుకు తెలుసు ఎండమావిలో దాహం తీరదని
మరమనిషి సమాజానికి మనసంటేనే తెలియదని ...
మనసుకు తెలుసు తన జాడలు
అందుకే అది వేస్తోంది ఆఖరి అడుగులు
మనస్వినీ....

No comments:

Post a Comment