మట్టి
మనసు
కళ్ళ ముందు
చికెన్ బిర్యానీ
పప్పన్నం ఎలా
రుచిస్తుంది
ఫారిన్ విస్కీ
లాగించే మనిషికి
నాటుసారా ఎలా
నచ్చుతుంది
సిరి సంపదల
మనసుకు
ఖాళీ పర్సు
ఎలా కనిపిస్తుంది
హంసతూలికా
తల్పం అలవడిన దేహానికి
చిరిగిన చాప
సుఖమేమిస్తుంది
బెంజికార్ల
బాటసారికి
కాలి నడక
ఎందుకు కనిపిస్తుంది
పచ్చనోటు
ఆరగించే వాడికి
చిల్లర నాణం
ఎలా అరుగుతుంది
ఊహల రెక్కలు
విచ్చిన మనసుకు
మట్టివాసన ఎలా
నచ్చుతుంది
పరులంతా
అబద్దమని భ్రమించే మనసుకి
నిజమెలాగుంటుందో
ఎలా తెలుస్తుంది
మనసా ఇదే లోకం
పోకడ
ఇలాగే ఉంటుంది
ఇక్కడ
నీ స్థాయి
తెలుసుకుని మసులుకో
మట్టిలో
పుట్టిన నీవు
మట్టిమనిశిగానే
ఆలోచించు
ఆకాశంలో
విహరించినా
చివరకు
ముద్దాదాల్సింది మట్టినే
మనసా
మట్టి
మనిషిగానే మిగిలిపో
మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసిపోతాము.
ReplyDeleteఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము. తెగిన గాలిపటము.
పగిలిన ఆవకాయ జాడ్యము. విరిగిన తెల్లని బలపము.