బుంగమూతి అందం
వన్నెచిన్నెల కోమలాంగి
బుంగమూతి ఎందుకు
ప్రియవల్లభుడేగా అంత
అలక ఎందుకు
పరువమంతా పదును పెట్టి
వలపులవంట చేసిపెట్టి
ఏకాంత మందిరంలో
విందులన్నీ వడ్డించి
పిండి వంటలు
తీపి పులుపులు పక్కన
పెట్టి
సోయగాల తళుకులు
అందించి
కనురెప్పల విస్తర్లు
వేసి
చిగురుటాకు పెదాలను
వార్చి
ముద్దుమాటల తీపి
అందించి
ఆకలి తీరలేదని మారాం
చేసిన సఖుడికి
సర్వమూ ధారపోసి
నిశిరాతిరి వంటకాలను
తమకంతో తినిపించి
ఆకలి ఇక తీరిందని
అనిపించి
ఓడిపోయి గెలిపించిన
నీకు అలక ఏల గడుసరీ...
నిశి ఆటల పదనిసలను
పదుగురిలో గురుతు చేసి
కవ్వించే ప్రియతముడిపై
అంత కోపమేల
చెలికాడి కర స్పర్శకు
నీ బుంగమూతి
పాలకోవలా కరిగిపోదా
మనస్వినీ...
మనస్వినీ...
No comments:
Post a Comment