మనసెందుకు ఇచ్చావ్
ఆ దేహం
ఆ నడక
ఆ పలుకు
ఆ మనసూ
నాదేనని
మారాం
చేస్తుంది నా మనసు
అందుకే ఆ మనసు
కోసం
నా మనసు
తాపత్రయం
ఎక్కడుంది
ఎలా ఉంది
ఎప్పుడు
వస్తుంది
అంటూ ఆరాలు
తీస్తుంది నా మనసు
క్షణం ప్రతిక్షణం
పరితపిస్తుంది
నా మనసు
పూలబాట
పరువలేకున్నా
ముళ్ళు
గుచ్చుకోకుండా ఉంటే చాలని
ఎడదను
పరుస్తుంది నా మనసు
మనసు
ఆరాటాన్ని తప్పుగానే చూస్తుంది
ఆ మనసు
పలకరించకుంటే
ముభావమని అంటుంది
పలకరిస్తే
ఇదేమని ప్రశ్నిస్తుంది
మనసు వేదనను
స్వీకరించని మనసు
వేధింపులేల
అని అడుగుతోంది
భగవాన్
నాకు
మనసెందుకు ఇచ్చావ్
No comments:
Post a Comment