మనసా మారిపో
మనసా పిచ్చి
మనసా
నిజాలు
గ్రహించలేవా...
భ్రమల
పునాదులమీదే నీ నివాసమా
నిజమేదో
అబద్దమేదో మనసుకు తెలియదా...
ఎందుకు మనసులో
లేనిది
ఉన్నదనే
భ్రమిస్తావు
అబద్దమని
తెలిసినా నిజమనే వాదిస్తావు ...
ఏమీ లేని చోట
సర్వమూ ఉన్నదని
అరచేతిలో లోకం
చూపిస్తావు ...
వాడిపోయిన
పువ్వులో
సువాసనలే
వెతుకుతావు ...
ప్లాస్టిక్
పువ్వును
ఇంకా
వాడిపోలేదేమి అంటావు ...
విషాదంలోనూ
వినోదమే ఉందని
అంటావు ...
సంతాపం
రాజ్యమేలుతూ ఉంటే
సంబరాలు జరుగుతున్నాయని
అంటావు...
ఏదీ నిజం
కాదని తెలుసు
అయినా అదే
నిజమని నమ్ముతావు...
చీకటి
అలుముకున్న మార్గంలో
అనుమానాలే
కాగాడాలంటావు...
మనసా
నిజమెరిగిన రోజు
రోదనలకు ఏ
మనసూ తోడురాదు...
ఓసి మనసా
పిచ్చి మనసా
భ్రమల మైకం
దిగిపోతే
వాస్తవాలు
ముందు నిలిస్తే
నీ మనసు
మనసుగా ఉంటుందా
మనసు మనసులో ఉంటుందా
...
మనసా ఇకనైనా
మారు
కల్పనల బాటను
వదిలి
సత్యమార్గంలో
పయనం మొదలు పెట్టు ...
మనసా మనసుగానే
ఆలోచించు ...
ఓ మనసు
మనసునిండా కోరుతోంది
ఓసి మనసా
ఇకనైనా మారిపో...
No comments:
Post a Comment