భయమేస్తోంది మనసా
ఏదో తెలియని
భయం
ఏమూలనో అంతు
చిక్కని కలవరం
ఏం జరగనుందోనని
అలజడి
మనసు మూలలో
ఎందుకో ప్రకంపనలు
కడిగిన మేలిమి
ముత్యం నా మానసం
ఎంతో
నమ్మకమైనది నా హృదయం
అందరినీ
నమ్మేస్తుంది ఆ మనసు నిత్యం
మనసు నమ్మకంపై
నాకూ అంతే నమ్మకం
సమాజంపైనే
లేదు నాకు నమ్మకం
విషనాగుల
నిలయం ఈ సమాజం
తన చింతన
లేనిదే చేయూతనివ్వని వైనం
సొంత మేలు
లేనిదే కొంత మేలు చేయని వ్యవహారం
మేకవన్నె
పులులకు ఇది ఆవాసం
ఎందుకో మనసా
స్నేహమనే
ముసుగుల పలకరింతలను
నమ్మదు నా
మనసు
ఎవరి స్వార్ధం
వారిదే
ఎవరి ఆరాటం
వారిదే
మనసు పోరాటం
మనసుదే
నా మనసే
గెలవాలని
మనసు
కోరుకుంటున్నా
ఎందుకో
భయమేస్తోంది
మనసా
మనసుకి భయపడుతున్నారు అంటే మర్మమేదో దాస్తున్నారనే దాని అర్థం కదండి :-) చాలా బాగుంది మీ కవిత.
ReplyDeleteమనసుకు కాదు మనసు భయపడుతోంది పద్మాజీ ...
Delete