జ్ఞాపకాల సమాధి
మరలా తట్టు
తగిలింది
తట్టు మీద
తట్టు తగులుతూనే ఉంది
కన్నులు ఉన్నా
కబోధినే నేను
తప్పుటడుగులు
వేస్తూనే ఉన్నా
గోడకు తగిలిన
బంతిలా
మరలా అక్కడకే
చేరుతున్నా
బుద్ది రాదు
మనసుకు
నడక రాదు
అడుగులకు
మెదడు నిండా
ఆలోచనలున్నా
మనసు మాటే
నెగ్గుతోంది
ఆ మనసే భంగపడుతోంది
చంపుకుంటా నా
మనసును
నడక నేర్పుతా
నా అడుగులకు
తిరగ రాస్తా
బంతి చరితను
సమాధి చేస్తా
అంతరంగమును
పూలబాట
తెలియకున్నా
ముళ్ళ బాటను చెరిపివేస్తా
గుండెనిండా
తిరస్కరిస్తున్నా
ఆ మనసును
కన్నీటి
సుడులలోనే దాచుకుంటా
మిగిలిఉన్న
జ్ఞాపకాలను
ఇక నా మనసు
మారదు
మనస్వినీ
No comments:
Post a Comment