మార్గం తెలియని అడుగులు
మనసు నిండా
నిర్వేదం
కనులనిండా
సుడిగుండం
కనుచూపుమేరలో
కనిపించని గమ్యం
ఇక
చాలునంటున్నది జీవనం
నడవలేనని
మారాం చేస్తొంది దేహం
తప్పులన్నీ
నావేనని నిందిస్తోంది లోకం
అనుభవించు
అంటున్నది మానసం
పరిణామాలన్నీ
విపరిణామాలై
కసినాగులా
కాటేస్తూ ఉంటే
నమ్మిన మనసు
ఉప్పెనలే ఎగదోస్తూ ఉంటే
విధిలేక వేసిన
అడుగులు
పిడిబాకులై
గుచ్చుకుంటూ ఉంటే
మనసు వేదనను
పసిగట్టని మనుషులు
పరిహాసమాడుతూ
ఉంటే
ఇక ఓపలేనని
రోధిస్తోంది హృదయం
నలుదిక్కులా
నిశి అలుముకుని
అన్ని
మార్గాలూ మూసుకుని
మార్గమే
తెలియని అడుగులు
ఒక్క చోటే
నిలబడిపోయినా
ముందుకు
సాగాలనే ఆశ చావలేదు
జీవించాలనే తపన
ఆగలేదు
సాధ్యం కాదని
తెలిసినా
No comments:
Post a Comment