Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 2 May 2015

ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కట్

ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కట్



సలాం భాయ్ క్యా హాల్ హై
నమస్తే అన్నా బాగున్నావా
అంతా గోలగా ఉంది...
ఎవరిగోల వారిదే
ఎవరి ముచ్చట్లు వారివే...
రోజూ కూర్చునే చోటే కూర్చున్నా
ఆకలి దంచేస్తోంది
చాయ్ ఉస్మానియా బిస్కట్స్ ఆర్డరిచ్చా
ఆత్మరాముడు కూల్...
సిగరెట్టు పొగను గాలిలోకి వదులుతూ
నలువైపులా దృష్టి సారించా ...
నరేంద్రమోడీ కేసీఆర్ లపై చర్చ
చంద్రన్న బడాయిలపై విసుర్లు
ఎప్పుడూ ఉన్న గోలే ...
మరో టేబుల్ దగ్గర నలుగురు కుర్రోళ్ళు
ఏరా ఆమ్మాయ్ మీ సిస్టర్ అన్నావ్
సినిమా హాల్లో ఏందిరా మీ సరసాలు
నువ్వేంటిరా ఆమెతో తిరుగుతున్నావ్
సారాంశం ఏమనగా నలుగురూ
ఒకరితోనే తిరుగుతున్నారు
నలుగురు ఒకరిని మోసం చేస్తున్నారా
నలుగురితో తనే ఆడుకుంటున్నదా
ఏమో ఇదో మాయాజాలం నాకెందుకనుకున్నా
మరో టేబుల్ పై సాఫ్ట్ వేర్ బాధితుడు
లాప్ టాప్ తో బిజీ బిజీ
అంతలోనే మోగిన సెల్
అవతల అమ్మాయేమో
ఇంట్లో ఉన్నా ఇప్పుడే లేచా వచ్చేస్తున్నా
అబద్దం మీద అబద్దం ...
మాసిన బట్టలతో ఇద్దరు
టీ తాగేశారు
కొడుకుల నిరాదరణ ఒకరిదైతే
అనుమానించే భార్య పోరు మరొకరిది...
అంతలోనే ఓ యాచకురాలి ఎంట్రీ
చంకలో చంటి పిల్ల...
నిన్నటి నుంచి ఏమీ తినలేదని రోదన...
చాయ్ బన్ను వద్దంటా
డబ్బులే కావాలంటా
ఇదో టైపు మోసమేమో ...
ఒకరు రాజకీయంలో బిజీ
మరొకరు ఇంటి పోరుతో పరేషాన్ ...
తనని తరిమేసిన బిడ్డలపై మమకారం
అనుమానించే ఆలిపై అనురాగం...
సెల్ ఫోన్ కబుర్లనిండా మోసం
అతివ ఆటలో మిత్రుల పోరాటం ...
చంటి బిడ్డ సాక్షిగా
యాచనలో మాయాజాలం...
సార్ ఇంకో చాయ్ తేవాలా
హోటల్ బాయ్ అరుపుతో
లోకంలోకి వచ్చాను...
ఔరా !!!
లోకం నిండా మాయాజాలం
ఎక్కడ చూసినా పోరాటం...
వీళ్ళందరి ముందు నేనెంత
నా బాధలెంత...
బాబూ ఇంకోసారి
చాయ్ ఉస్మానియా బిస్కట్స్ తీసుకురా...

No comments:

Post a Comment