నీ రాతనే మార్చి వేస్తా
ఏక్ మౌఖా దే
మౌలా తేరీ తక్దీర్ బదల్ దూంగా
తేరీ లిఖీ హర్
లఖీర్ మిటాదూంగా
నుదుటిన గీసిన
గీతలు
పెనవేసుకున్నాయి
నువ్వురాసిన
రాతలు అర్థాలు మార్చుకున్నాయి
పెనవేసుకున్న గీతలు
కొత్త
చరిత్రనే రాసుకున్నాయి
ఎవరు పుట్టారు
జగతిలో
నన్ను మోసం
చేసేందుకు
ఎవరికిచ్చావు
అంత తెలివి
నన్ను
ముంచేందుకు
ఎవరికంత సత్తా
ఉంది నన్ను చంపేందుకు
నన్ను నేను
మోసం చేసుకున్నా
నన్ను నేనే
చంపుకున్నా
నా అడుగుల
జాడలు నేనే చెరుపుకున్నా
నా బాటలో నేనే
ముళ్ళు పరుచుకున్నా
ఎందుకు
నిందించాలి ఎవరినో
నన్ను నేనే
ముంచుకున్నా
ప్రతి ఎత్తుకు
నేనే చిత్తు వేసుకున్నా
గెలుపు
గమ్యాన్ని నేనే మార్చుకున్నా
ఓటమి దిశను
నేనే ఎంచుకున్నా
ఒకే ఒక్క
అవకాశం కావాలి నాకు
విజేతనై
మిగిలిపోతా
దేవుడా
ఒకే ఒక్క
అవకాశమివ్వు
నీ రాతనే
మార్చి వేస్తా
No comments:
Post a Comment