ఓడిపోయానేమో
కనుచూపు మేరలో
ఎండమావులు
అడుగుతీసి
అడుగు వెయ్యలేను...
గొంతు తడారిపోతోంది
పెదాలు
పెళుసుబారుతున్నాయి...
బయటకు వెళ్ళిన
ఊపిరి
మరలా శ్వాస
తీసుకోలేనంటోంది...
ఎండమావులను
దాటితే
నీటిచెలమలున్నాయని
తెలుసు...
భారమైన
అడుగులు నేలలోకి కుంగిపోతున్నాయి
అడుగులజాడలు
ధూళిలో కలిసిపోతున్నాయి...
దప్పిక తీర్చే
కొలనుకు చేరగలనా
నా గుండె
గొంతుక దాహం తీరేనా...
అల్లకల్లోల
కడలిలో నా పయనం
కనుచూపుమేరలోనే
తీరం...
ఊరించే పచ్చిక
బయళ్ళు
స్వాంతన ఇచ్చే
పూదోటలు...
నా నావ పయనం
సాగేనా
సుడిగుండాలను
దాటి తీరం చేరేనా...
ఎండమావుల్లో
కరిగిపోతానేమో
కెరటాల
కౌగిలిలో మునిగిపోతానేమో...
ఓడిపోతున్నానా
ఓటమి తప్పదా
...
అంతిమ ఘడియలంటే
ఇవేనా
పరాజయం ఇలాగే
ఉంటుందా...
గెలవాలనే ఉంది
నాకు
ఓడిపోవాలని
లేదు నాకు...
అయినా
తప్పదేమో ఓటమి
తలవంచక
తప్పదేమో ఇకనైనా...
ఏమో..
ఓడిపోయానేమో
మనస్వినీ...
No comments:
Post a Comment