కుక్క తోక మనసు
మారదా నా మనసు
మారనే మారదా
నా బుద్ధి
మారవా నా
ఆలోచనలు
కుక్క తోక
వంకరేనా నా చిత్తం
ఎందుకు మారదు
నా అంతరంగం
చేసిన తప్పులే
మళ్ళీ మళ్ళీ
చేస్తూ ఉంటుంది
ఎన్నిసార్లు
ఛీ పొమ్మన్నా
అటువైపే
అడుగులు వేస్తున్నది
మండుతున్న
గాయాన్నే
మళ్ళీ మళ్ళీ
కెలుకుతున్నది
లక్షల బాణాలు
గుండెను ఛిద్రం చేస్తున్నా
శరపరంపరలో
దూసుకువచ్చే
ఒక్క పువ్వునే
చూస్తున్నది
దూరమైన మనసు
దాడికి విలవిల లాడినా
ఒక్క చిన్న
పలకరింపుకే పులకించిపోతున్నది
చిరుజల్లు
తాకిడికే
అమృతవర్షమని పరవశించిపోతున్నది
చిరుజల్లులో
వడగండ్లు
తాకగానే
కన్నీరుమున్నీరు
అవుతున్నది
ప్రతి మనసుకూ
ఆలోచనలుంటాయనీ
మనసు
ప్రాధాన్యాలు మారాయని తెలిసినా
పిచ్చి మనసు
అదే మారాం చేస్తున్నది
నిప్పుల
కుంపటిలో తగలబడుతున్నా
చిరు చినుకునే
జోరువాన అనుకుంటున్నది
చేసిన తప్పే మళ్ళీ
మళ్ళీ చేస్తున్నది
కుక్క తోకన్నా
మారుతుందేమో గానీ
మారదు నా
మనసు....
No comments:
Post a Comment