దేవుడు చేసిన తప్పులు
అర్హత లేని
వారిని అందలాలు ఎక్కించావు
అర్హత
ఉన్నవాడిని పాతాళంలోకి విసిరేసావు
మనసున్న
మనిషికి సుఖమే లేకుండా చేసావ్
మనసంటే
తెలియని వాడికి స్వర్గాన్నే అందించావు
గొప్పోళ్ళు ఏం
చేసినా తప్పే కాదన్నావు
లేనివాడు మంచి
చేసినా నేరమనే రుజువు చేసావు
ఉన్నవాడికే
అన్నీ ఇస్తూ నీరు పల్లమెరుగు అన్నావు
లేనివాడిని
నిత్యం ఆకలితో చంపావు
దరిద్రుడు
ప్రేమిస్తే అపరాధమే అన్నావు
గొప్పోళ్ళు
విలువల వలువలు విసిరేస్తే అదే న్యాయమని అన్నావు
గతిలేక
పిల్లలను పోషించలేక పోతే చేతకాని వాడని అన్నావు
మదమెక్కి పిల్లలను
గాలికి వదిలే వాళ్ళను నాగరీకులన్నావు
మొగుడు
పెళ్ళాన్ని వదిలేస్తే కిరాతకుడన్నావు
భార్యే భర్తను
వదిలేస్తే వీరనారి అంటూ జేజేలు పలికించావు
ఆడది ఆబల కాదు
సబల అంటూనే
ముదితలకు నరకం
చూపిస్తున్నావు
అన్నకు
తమ్ముడు కాకుండా చేసావు
భార్యకు
భర్తకు తగాదాలు పెట్టావు
మనసులను మాయం
చేసి తనువుల అంగడి నడిపావు
ధర్మమే
గెలుస్తుందని రాతలు రాసుకుంటూ
అసురులనే
గెలిపిస్తావు
ఇన్ని తప్పులు
ఎలా చేసావు
అందరి తలరాతలు
రాసే నువ్వే ఇన్ని తప్పులు చేస్తే
ఇంకా
నువ్వెందుకు నీ పాలన ఎందుకు
దేవుడా నీ
తప్పులు సవరించుకో
ReplyDeleteThank God, You made such mistakes :)
cheers
zilebi