ఆదాబ్ హైదరాబాద్
ఆదాబ్ భాయ్ జాన్
నమస్తే అన్నా
ఖైరీయత్ భాయ్
బాగున్నవా అన్నా
ప్రతి పలుకూ ఆత్మీయం
భాయ్ అని పిలిచినా
అన్నా అని పలకరించినా
మా జీవనం అనుబంధాల
ఆలయం
గంగా జమునా తహజీబ్
మాది
నిండు గుండెల సంగమం
మాది
రంజాన్ నమాజుల
రివాజులం మేము
వినాయకుడి ఉత్సవ వేళ
ఎగసిపడే సింధూరం మేము
షీర్ ఖుర్మా తీయదనం
మేము
దసరా సమ్మేళనంలో
అలాయ్ బలాయ్ మేము
చార్ మినార్ శిఖరాన
విజయపతాకం మేము
భాగ్యలక్ష్మీ ఒడిలో
పువ్వులమే మేము
ఇంటిమీద హరితపతాకం
గడపమీద పసుపు ప్రకాశం
తలమీద తాజ్ వైభవం
నుదుటి మీద కుంకుమ
పవిత్రం
అన్నింటా మేమే సమస్తం
ఖుతుబ్ షాహీ వారసులం
భాగమతీ బంధువులం
శాంతి వనంలో కుసుమించే
పువ్వులం
రాముడు మేమే రహీమూ
మేమే
అన్ని మతాలూ మేమే
అన్ని పండగలూ మావే
అన్ని ఉత్సవాలూ మావే
విడదీయరాని అనుబంధం
మేము
అతిథి మర్యాదలకు నిలయం
మేమే
మా పూలవనంలో కొన్ని
చీడపురుగులు చేరినా
ఐకమత్యంతో ఏరివేసేదీ
మేమే
అవును మేము అన్నింటా
ప్రత్యేకం
అందరికీ విభిన్నం
దక్కన్ భూమిలో విరిసిన
పుష్పాలం
చరిత్ర సలాం చేసే
హైదరాబాదీలం
అందుకే మా హృదయం
ప్రతిక్షణం తలవంచి
చెబుతుంది
ఆదాబ్ హైదరాబాద్
Chaala Bhaagundi
ReplyDeleteSuper
ReplyDeleteSuper
ReplyDelete