మళ్ళీ మళ్ళీ పుడుతున్నా
కనురెప్పల లోగిలిలో
ఆవరించిన తన్మయం
భారంగా వాలిపోయే
ఆ రెప్పల పరవశం
వణుకుతున్న పెదాల
కలవరం
ఏమవుతోందో తెలియని
మైకం
విరిసిన సొగసులో
తెలిసీ తెలియని ఆనందం
తడారుతున్న గొంతుకను
తడి చేసే ఆరాటం
ఆశ్వంలా చెలరేగిన
పరువం
లొంగుబాటు పయనం
దేహతంత్రులలో ఏదో
తెలియని
విద్యుత్ ప్రవాహం
ఇంతకు మించి జగతిలో
ఏమీ లేదనే విజయగర్వం
జీవితానికి ఇక కారణమే
లేదనే
వైరాగ్యం
కమ్ముకున్న వైరాగ్యం
పునాదిలో
మొలకెత్తే జీవనపుష్పం
అది జీవితమా
లేక
మరణమా
ప్రతిసారీ మరణించే
నేను
అన్నిసార్లూ
జీవిస్తున్నానా
అది మరణమే అయితే
మరణించిన ప్రతిసారీ
నీ ఒడిలో నేను
మళ్ళీ మళ్ళీ
పుడుతూనే ఉన్నా
మనస్వినీ
No comments:
Post a Comment