వయసూ మనసుల ఆరాటం
ఏం కోరుకున్నది నా
మనసు
మణులు మాణ్యాలు
కోరినదా
రత్నాలు రాశులు
ఆశించినదా
అపారమైన ధన సంపదను
అభిలషించినదా
చిన్న చిరునవ్వు
కోరుకున్నది
సంపదను మించిన ఆనందం
ఆశించినది
జీవనయానంలో దొరకని
అనుభూతిని
జీవన సంధ్యలో వరముగా
అడిగినది
ఏ నిమిషంలో ఆగిపోతుందో
తెలియని గుండెకు
మమతల ప్రాణవాయువు
కానుకగా ఇమ్మన్నది
ఇది వయసూ మనసుల
విరోధమా
తరాల మధ్య అంతరమా
ఏ మనసు ఎదిగినదో
ఏ మనసు ఇంకా ఎదగాలో
తెలిసీ తెలియని సమరమా
ఎందుకు ఈ అర్థం కాని
అయోమయం
ఎప్పటిదాకా అంతులేని ఈ
అగాధం
లక్ష జన్మలు ఎత్తినా
నేనొక
అర్థం కాని పజిల్ నే
మనస్వినీ
No comments:
Post a Comment