నిన్నెంత ప్రేమిస్తున్నా
నీ మీద నాకు ప్రేమ ఎంత
ఉందని
ఇలా అడిగితే ఏమని
చెప్పను
నీకూ నాకూ మధ్య
అనుబంధానికి
కొలమానం ఎలా చూపగలను
హృదయానికి
స్పందనలకు మధ్య
అనుబంధాన్ని
ఒక్కసారి తరిచి చూడు
చిటారు కొమ్మన తన
పిల్లలకు
గింజలు పెట్టే
పక్షిలోని ఆత్రం చూడు
అప్పుడే కన్నులు
తెరిచినా
తల్లిని చూసి
విచ్చుకునే
పెదాల్లో మెరుపులు
చూడు
మనసులో పుట్టి కనుచెలమలను
దాటి
జారిపడుతున్న కన్నీటి చుక్కను
అడుగు
నా ఊపిరిలో నీవై నిండి
జీవంపోస్తున్న శ్వాసను
అడుగు
నా ప్రేమ తెలుస్తుంది
ఎంత ప్రేమిస్తున్నామనే
దానికి
కొలమానాలే ఉంటే
నా గుండెను చీల్చి
నీకు చూపించనా
మనస్వినీ
No comments:
Post a Comment